తల్లిని అవ్వాలని ఉంది.. ఇప్పటికే ఆలస్యం: సమంత
దక్షిణాది బ్యూటీ సమంత నటించిన హనీబన్నీ వెబ్ సిరీస్ ఈనెల ఏడోతేదీన అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ వ్యూయర్ షిప్ బాగానేఉంది. హాలీవుడ్ సిటాడెల్ వెబ్ సిరీస్ కు ఇది రీమేక్. వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించగా, రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సొంత బ్యానరులో మాఇంటి బంగారం పేరుతో ఓ సినిమా చేస్తోంది. తనకు సినిమా అవకాశాలు రావడంలేదని అబుదాబి వేదికగా జరిగిన కార్యక్రమంలో బహిరంగంగానే రానాతో సమంత చెప్పింది. మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు సినిమాలకు ఏడాదిన్నర గ్యాప్ ఇవ్వడమే దీనికి కారణం.
తల్లిని కావాలనుంది
హనీబన్నీ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సిరీస్ లో తాను పోషించిన తల్లి పాత్ర గురించి మాట్లాడింది. తనకు కూడా తల్లిని కావాలనే కోరిక ఉందని, కలలు ఉన్నాయని, అమ్మగా ఉండటానికి బాగా ఇష్టపడతానని సమంత చెప్పారు. అయితే ఇందుకు బాగా ఆలస్యమైందని మాత్రం తాను అనుకోవడంలేదని, జీవితంలో ప్రస్తుతం తాను చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నానని చెప్పింది. నిజ జీవితంలో తల్లిని కావాలనే కోరిక ఉందని సమంత చెప్పడం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీన్నిబట్టి సమంత రెండోపెళ్లి చేసుకోబోతున్నట్లుగా ముందే చెప్పిందని, అందుకు హింట్ ఇచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై చర్చ నడుస్తోంది.

ఓ దర్శకుడితో డేటింగ్ చేస్తోందంటూ..
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా ఉంటున్న సమంత ఓ దర్శకుడితో డేటింగ్ చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయికానీ వాటిల్లో వాస్తవమెంత అనేది ఎవరికీ తెలియదు. అవన్నీ రూమర్లే అంటూ సమంత అభిమానులు కొట్టేస్తున్నారు. అయితే తల్లిని కావాలనుందని చెప్పడంతో రెండోపెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లుగా భావించవచ్చొంటున్నారు. ఇటీవలే సమంత మాట్లాడుతూ తాను ఒంటరిగా ఉండాలని అనుకోవడంలేదని, త్వరలోనే మీకు ఆ విషయం తెలుస్తుందని ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ రెండు సంఘటనలనుబట్టి, సమంత వ్యాఖ్యలను బట్టి రెండోపెళ్లికి గట్టిగా సిద్ధపడి ఉందని, అతనెవరనేది త్వరలోనే తేలుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. చూడాలి అతనెవరనేది.












Click it and Unblock the Notifications