నీకు సిగ్గుంటే ఫస్ట్ ఆ పని చేయ్.. రెచ్చిపోయిన సమంత
సమంత ఇటీవల సినిమాల్లో కన్నా వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తున్నారు. సమంతకు కొందరు కోపం తెప్పించారు. దీంతో ఆమె వారిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. వారిపై అంతలా సమంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణాన్ని తెలుసుకుందాం. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారామె.
ఆర్యోగం సహకరించక పోవడంతో సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. మయసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత, ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంది. దీంతో వరుస సినిమాలను లైన్లో పెడుతోంది.విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తర్వాత సమంత మరో తెలుగు సినిమాలో నటించలేదు. 'సిటాడెల్' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో మాత్రం సమంత నటించారు. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ వెబ్ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇక తొలిసారి నటించిన నిర్మించిన 'శుభం' సినిమా సైతం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. 'మా ఇంటి బంగారం' సినిమాతో సమంత తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతుంది.

ఇదిలా ఉంటే తాజాగా సమంత షేర్ చేసిన ఫొటోలను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సమంత బాగా బరువు తగ్గిపోయిందని.. సన్నగా అనారోగ్యంగా కనిపిస్తోంది అంటూ పలువురు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తనని ట్రోల్ చేసిని వారికి అదే రీతిలో సమంత కౌంటరిచ్చింది. ముందుగా మీరు ఈ మూడు పుల్ అప్స్ చేయండి..అప్పుడు నన్ను ట్రోల్ చేయండి. లేదంటే కామెంట్ చేయొద్దని చెప్పి తనని ట్రోల్ చేసిన వారికి గట్టి సవాల్ విసిరింది. ఈ విధంగా తన శరీరంపై వచ్చిన విమర్శలకు సరైన సమాధానం ఇచ్చింది సమంత.












Click it and Unblock the Notifications