నోరు అదుపులో పెట్టుకో..నితిన్‌కు వార్నింగ్ ఇచ్చిన సమంత..?
టాలీవుడ్ యంగ్ హీరోల్లో నితిన్ కూడా ఒకరు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుస సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను పెంచుకుంటున్నాడు నితిన్. అయితే నితిన్‌కు రావాల్సిన పేరు ఇంకా రాలేదని అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఒక హిట్ పడితే నాలుగు ఫ్లాపులు అన్నట్టుగా సాగుతోంది నితిన్ కెరీర్. జయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నితిన్ తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే దిల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఆ తరువాత నుంచి నితిన్ కెరీర్ గాడి తప్పింది. నాలుగు సినిమాలకు ఓ హిట్టు అన్న చందంగా మారింది. భీష్మ తరువాత నితిన్ నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి.
నితిన్ చివరి సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. నాసిరకం దర్శకులతో సినిమాలు చేయడం వల్ల నితిన్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఇదిలా ఉంటే నితిన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నితిన్‌కు సమంత వార్నింగ్ ఇచ్చిందనే వార్త ఇప్పుడు నెట్టింట్ వైరల్‌గా మారింది. వీరిద్దరు కలిసి ''అఆ'' సినిమా చేశారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి నమోదు చేసుకుంది. అయితే సినిమా షూటింగ్ మధ్యలో నితిన్‌కు సమంత వార్నింగ్ ఇచ్చారట.

సమంతతో ఉన్న చనువుతో నితిన్ సమంతపై కుళ్ళు జోకులు వేయడమే కాకుండా చీటికి మాటికి సమంతపై కామెంట్స్ చేసేవాడట. ఒకరోజు సమంత ఎటువంటి మూడ్‌లో ఉందో చూసుకోకుండా ఆమెపై సెటైర్లు వేశాడట. దీంతో సమంత నితిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నీ పరిధి నువ్వు దాటకు.. ఇంకోసారి నా మీద నీ కుళ్ళు జోకులు వేస్తే బాగుండదు.. నోరు అదుపులో పెట్టుకో.. లేకపోతే నోరు మూసుకొని జాగ్రత్తగా ఉండు.. ఇంకొకసారి ఈ కామెంట్స్ నీ నోటి నుండి వినిపిస్తే మాత్రం బాగుండదు.. అంటూ అందరి ముందే వార్నింగ్ ఇచ్చిందట. దీనిపై అప్పట్లోనే అనేక వార్తలు వినిపించాయి. సమంతకి అంత కోపం ఎందుకు వచ్చింది.. సమంతకి అంతలా కోపం వచ్చే పని నితిన్ ఏం చేశాడంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications