జీవితంలో అతన్ని ఎప్పటికీ వదులుకోను: సమంత షాకింగ్ కామెంట్స్
భారతదేశంలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్ లు ఒప్పుకుంది. తన సొంత బ్యానరు ట్రూలాలలో మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమా ప్రారంభించింది. అయితే దీనిపై ఇంతవరకు అప్ డేట్ ఇవ్వలేదు. ఈ సినిమా ఉంటుందా? లేదా? అనే అయోమయం సమంత అభిమానుల్లో నెలకొంది. మయోసైటిస్ సోకిన తర్వాత చికిత్స కోసం సినిమాలకు రెండు సంవత్సరాలు విరామం ప్రకటించింది. ఒక సంవత్సరం మాత్రం బెడ్ మీదే ఎక్కువగా గడిపినట్లు సమంత చెప్పింది. తాను కష్టాల్లో ఉన్న సమయంలో తనకు ఎంతో అండగా నిలబడిన వ్యక్తి ఒకరున్నారని, జీవితాంతం అతనికి రుణపడివుంటానని తెలిపింది.
తనవల్ల ఎంతో మనశ్శాంతి లభించేది
జీవితకాలంలో ఎప్పుడూ అతన్ని దూరం చేసుకోనని చెప్పింది. అతనెవరో కాదు.. రాహుల్ రవీంద్రన్. సమంతకు మంచి స్నేహితుడు. సమంత సినిమాలన్నింటికీ డబ్బింగ్ చెప్పిన చిన్మయి భర్త అతను. మయోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటున్న సమయంలో ప్రతిరోజు అతను తన దగ్గరకు వచ్చిన ఎంతో ధైర్యం చెప్పేవాడని, కొంత సమయం నాతో గడిపి జోక్స్ వేస్తూ తనను నవ్వించేవాడని, అలా తన మనసులో ఉన్న భారాన్ని తొలగించేవాడని సమంత చెప్పింది. రాహుల్ రవీంద్రన్ లాంటి స్నేహితుడు తనకు దొరకడం, చిన్మయి లాంటి స్నేహితురాలు దొరకడం కూడా ఎంతో అదృష్టమని చెప్పింది. రాహుల్ వల్ల తనకు ఎంతో మనశ్శాంతి లభించిందని, తనకు అవసరమైన పనులు కూడా అతనే చేసిపెట్టేవాడని సమంత వెల్లడించింది.

అతనిలాంటి స్నేహితుడు దొరకాలంటే అదృష్టం ఉండాలి
రాహుల్ లాంటి స్నేహితుడు అందరికీ దొరకాలంటే అదృష్టం ఉండాలంది ఈ విషయాలన్నింటినీ చెబుతూ సమంత భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం సమంత చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. రాహుల్ రవీంద్రన్ అందాల రాక్షసి సినిమాలో హీరోగా నటించాడు. ఆ తర్వాత చిలసౌ, మనమ్మథుడు2 లాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం రష్మిక ప్రధాన పాత్ర పోషిస్తున్న గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే సమంత కూడా ఫ్యామిలీమాన్2 తర్వాత హనీబన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించింది. సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయికానీ చేయాలా? వద్దా? అనే నిర్ణయాన్ని తాను ఇంకా తీసుకోలేదని తెలిపింది.


Click it and Unblock the Notifications