కంట్రోల్ చేసుకోలేక స్టేజ్‌పైనే ఏడ్చేసిన సమంత..నాగ చైతన్యను గుర్తు చేసుకుంటూ..
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.
అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే వీరి విడాకులపై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. నాగ చైతన్య మరో అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నారనే సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగ చైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదించుకున్నారు.
విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు.నాగ చైతన్య శోభితను రెండో వివాహం చేసుకోగా, సమంత మాత్రం సింగిల్‌గానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు.అయితే నాగ చైతన్య , సమంత కాంబినేషన్‌లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఏమాయ చేశావే, మనం, ఆటో నగర్ సూర్య, మజిలి వంటి సినిమాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఏమాయ చేశావే సినిమాతోనే సమంత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చించిందనే విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ సమంత కన్నీళ్లు పెట్టుకున్నారు. సమంత తానా వేదికపై మాట్లాడుతూ తన కెరీర్ ప్రస్థానం గురించి, తెలుగు ప్రేక్షకుల పట్ల తనకున్న కృతజ్ఞత గురించి ఎమోషనల్‌గా మాట్లాడింది. ఈ రోజు ఇక్కడ నిలబడి ధన్యవాదాలు చెప్పడానికి నాకు 15 ఏళ్లు పట్టిందని ఆమె అన్నారు.
తన కెరీర్ ప్రారంభమైన 'ఏ మాయ చేసావే' సినిమా నుంచే తెలుగు ప్రేక్షకులు తనను అంగీకరించారని, ఆదరించారని సమంత గుర్తు చేసుకుంది. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ చెప్పలేని కృతజ్ఞతను ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. మొదటి నుండి మీరు నన్ను మీ ఇంటి అమ్మాయిలా భావించారంటూ తనపై ప్రేక్షకులు చూపిన ప్రేమను ఆమె ప్రస్తావించింది.ఏమాయ చేశావే సినిమా షూటింగ్ సమయంలో సమంత , నాగ చైతన్య ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications