నాగార్జునకు సాయం చేసిన సమంత

హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళను ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు.సమంత మాత్రం ప్రస్తుతానికి ఒంటరిగానే ఉంటున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ 8 సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో సమంత మరోసారి వార్తల్లో నిలిచారు.

మొదటి రెండు సీజన్ల తర్వాత నాగార్జున తెలుగు బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో కొన్ని రోజులు నాగార్జున కనిపించలేదు. సినిమా షూటింగ్ కారణంగా నాగార్జున రెండు వారాలు షోకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో ఒకవారం సీనియర్ నటి రమ్యకృష్ణ హోస్ట్‌గా రాగ, మరో వారం హీరోయిన్ సమంత హోస్ట్‌గా వ్యవహరించారు. అక్కినేని కోడలుగా, స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్‌లో ఉన్న సమంత బిగ్‌బాస్ హోస్ట్‌ అవతారం ఎత్తెడంతో సినీ అభిమానులంతా ఆ ఎపిసోడ్స్ కోసం చాలా అతృతుగా ఎదురు చూశారు.

Samantha hosted the 4th season of Bigg Boss

అందరు భావించినట్టుగానే సమంత హోస్ట్‌గా వ్యవహరించిన వారం టీఆర్పీ రేటింగ్స్ బద్దలయ్యాయి. బిగ్‌బాస్ షో చరిత్రలో ఎప్పుడు రాని రేటింగ్ సమంత హోస్ట్‌గా వ్యవహరించినప్పుడే వచ్చాయి. ఏకంగా 11.4 టీఆర్పీతో సమంత రికార్డులు బద్దలు కొట్టేసింది. మామగారి కోసం సమంత చేసిన ఆ సాయం బిగ్‌బాస్ షోకి రికార్డు వ్యూస్ తెప్పించింది. ఆ తర్వాత కాలంలో సమంత నాగ చైతన్యతో విడిపోయి అక్కినేని ఫ్యామిలీకి దూరం అయిన సంగతి తెలిసిందే. సమంత రికార్డు చెరిగిపోవడానికి మూడేళ్ల సమయం పట్టింది. బిగ్‌బాస్ సీజన్ 7 లాంచ్ ఎపిసోడ్‌కి 18.1 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న కొత్త సీజన్‌ ఎన్ని రికార్డులు తన పేరిట క్రియేట్ చేసుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+