మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా..సమంత పోస్ట్ వైరల్
హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఏమాయ చేశావే'' సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన ''దూకుడు'' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది.
టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకులు తర్వాత సమంతను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడ్డ సమంత , కోలుకున్న తర్వాత వరుస సినిమాలు చేస్తోంది.

''సిటాడెల్'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో పాటు మరో రెండు సినిమాలకు సమంత ఓకే చెప్పింది. ఇదిలా ఉంటే సమంత బ్యాడ్మింటన్ స్టార్, ఓలింపిక్ పతక విజేత పీవీ సింధు పెళ్లిపై స్పందించింది. హైదరాబాద్‌కు చెందిన టెక్ ఎగ్జిక్యూటివ్ వెంకట దత్త సాయిని పీవీ సింధు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిపై సమంత తన ఇన్‌స్టాలో విషెష్ చెబుతూ...''మీ ఇద్దరికీ అభినందనలు,మీరు ఎప్పటికీ ఇలానే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా'' అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications