నాగచైతన్య నిశ్చితార్థం తర్వాత ఆస్తిపై లాయర్లతో సమంత చర్చలు?

నాగచైతన్య-సమంత జోడి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. వారు ప్రేమలో పడినప్పటి నుంచి పెళ్లి చేసుకునేవరకు, విడిపోయిన తర్వాత, నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్న తర్వాత కూడా సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరి వార్తలే ఉంటున్నాయి. అంతగా ఈ జంట సోషల్ మీడియాను ప్రభావితం చేస్తోంది. ఈనెల ఎనిమిదో తేదీన నాగచైతన్య శోభిత ధూళిపాళకు నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను నాగార్జున్ ట్విటర్ లో పెట్టారు. త్వరలోనే వివాహ తేదీని ప్రకటించనున్నారు. నాగచైతన్య నిశ్చితార్థం జరిగిందన్న వార్త సమంత అభిమానులను తీవ్ర షాక్ కు గురిచేసింది.

అధికారికంగా సమంత స్పందించకపోయినప్పటికీ గతంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం వైరలవుతున్నాయి. తాజాగా సమంతకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. సినిమాలద్వారా దాదాపు రూ.150 కోట్లను సమంత ఆర్జించింది. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంద్వారా తన ఆదాయాన్ని పెంచుకుంది. సినిమాకు కనీసం రూ.4 నుంచి రూ.6 కోట్ల మధ్య తీసుకుంటుంది. ప్రత్యూష ఫౌండేషన్ ఏర్పాటు చేసి దీనిద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తోంది.

Samantha is going to give 60 percent of the property to orphanages

న్యాయనిపుణులతో మాట్లాడుతున్న సమంత
ప్రస్తుతం తనకున్న ఆస్తిలో 60 శాతాన్ని అనాథ పిల్లలకు రాసేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా అనాథ పిల్లలతో ఆశ్రమాలు నడుపుతున్నవారికి భారీగా విరాళాలు అందజేసింది. అకస్మాత్తుగా సమంత ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పటివరకు ఒంటరిగానే జీవిస్తోంది. ఇప్పుడు నాగచైతన్యకు శోభితతో నిశ్చితార్థం జరగడంతో ఈ నిర్ణయం తీసుకొనివుంటుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో కూడా సమంత ఒంటరిగా ఉంటుందా? లేదంటే వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతుందా? అనే విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతానికి మాత్రం ఒంటరిగానే జీవించాలనుకుంటోందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+