సమంత ఫుల్లు హ్యాపీ... ఎందుకో తెలుసా?

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె స్టార్ కాబట్టి. నాగచైతన్యతో వివాహానికి ముందు ఎంత పేరు తెచ్చుకుందో అతనితో విడాకులు తీసుకున్న తర్వాత అంతకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంది. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్ కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంది. చికిత్స తీసుకోవాలనే ఉద్దేశంతో అంతకుముందు తాను నిర్మాతల దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్స్ డబ్బును కూడా తిరిగిచ్చేసింది.

మయోసైటిస్ కు చికిత్సతోపాటు విదేశాలు కూడా చుట్టివచ్చింది. తాను ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా ఆ విషయాలన్నింటినీ సోషల్ మీడియాలో ఉంచి అభిమానులతో పంచుకుంటుంది. కొద్దిరోజుల క్రితం సమంత హనుమాన్ చిత్రానికి గట్టి సపోర్ట్ చేసింది. తన మాజీ మామయ్య నాగార్జున, మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలు ఉన్నప్పటికీ వాటిని కాకుండా హనుమాన్ కు మద్దతివ్వడం ఏంటమని అందరూ ఆశ్చర్యపోయారు.

Samantha is happy about the success of Hanuman movie

తను కోరుకున్నట్లుగా సోషల్ మీడియాతో సమంత అభిమానులంతా హనుమాన్ కు మద్దతుగా నిలిచారు. అంతేకాదు.. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకొని సినిమా చూసినవారు కూడా ఉన్నారు. పాన్ ఇండియా చిత్రంగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన హనుమాన్ ను చూసి సమంత ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓబేబీ సినిమాలో తేజ సజ్జాతో కలిసి నటించింది. అప్పటినుంచే తేజ మంచి టాలెంట్ కలవాడని గుర్తించి సపోర్ట్ చేయడం ప్రారంభించింది.

ఆ స్నేహంతోనే హనుమాన్ కు మద్దతుగా నిలబడింది. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు తెలుగులో థియేటర్లు సరిగా కేటాయించని విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని సమంత తేజకు మద్దతుగా నిలబడింది. చివరకు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో సమంత ఎంతో సంతోషంగా ఉందని, ఎంతోకాలం తర్వాత తాను ఇలా ఉంటోందని ఆమె సన్నిహితులు తెలియజేస్తున్నారు. అగ్రహీరోల సినిమాలను కాదని తాను మద్దతుగా నిలబడిన హనుమాన్ విజయం సాధించడంపై సమంత ఆనందానికి అవధుల్లేవంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+