విడాకులకు కారణం ఆమేనా? వైరల్ గా మారిన సమంత కామెంట్స్

తెలుగులో ఉన్న స్టార్ కథానాయికల్లో సమంత ఒకరు. సమంత అనగానే మనకు రెండు విషయాలు కచ్చితంగా గుర్తుకువస్తాయి. అందులో ఒకటి అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడటం.. పెళ్లిచేసుకోవడం.. తర్వాత విడాకులు తీసుకోవడం. రెండో విషయం ఏమిటంటే మయోసైటిస్ వ్యాధి బారిన పడి ప్రస్తుతం చికిత్స తీసుకోవడం. ఇటువంటి సమయంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండేందుకు విదేశాలను సందర్శిస్తూ, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ.. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించడం లాంటిది చేస్తుంటుంది.

నాగచైతన్య పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు సమంత హావభావాలుకానీ, సమంత పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు నాగచైతన్య హావభావాలను అర్థం చేసుకుంటే వీరిద్దరికీ ఒకరిపై ఒకరికి బయటకు కనపడనంత ప్రేమ ఉంటుందని అభిమానులు అంటుంటారు. విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య ఎక్కడా సమంత గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడకుండా హుందాగా వ్యవహరించారు. కాకపోతే సమంత అప్పుడప్పుడు భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకోలేక పరోక్షంగా నాగచైతన్యను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిందంటారు.

samantha latest comments her friend meghana vinod

తాజాగా వీరి విడాకులకు సంబంధించిన మరో విషయం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం సమంత స్నేహితులురాలు మేఘన వినోద్ అని. మేఘనతో ఉన్న ఫొటోను సమంత షేర్ చేయడంతోపాటు కొన్ని కామెంట్లు చేసింది. జీవితంలో తాను తీసుకునే మంచి నిర్ణయాలకు ఒక రూపం ఉంటే అది మేఘనది అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోతోపాటు సమంత ఇచ్చిన క్యాప్షన్ తీవ్రంగా వైరలవుతోంది. మరోసారి నాగచైతన్య విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారింది. మేఘనవల్లే వారిద్దరూ విడిపోయారా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+