అల్లు అర్జున్ హగ్‌పై సమంత షాకింగ్ పోస్ట్

హీరోయిన్ సమంత ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కుడ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. నాగ చైతన్యతో విడాకులు అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయసైటీస్ వ్యాధి కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సమంత, ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా నాగచైత్యన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె.

ఈక్రమంలోనే బాలీవుడ్ 'సిటాడెల్ (హనీ, బన్నీ)' అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. హీరో వరుణ్ ధావన్‌తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత నటించారు. మరో రెండు బాలీవుడ్ సినిమాలకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది.

Samantha post viral on Allu Arjun-Snehareddy Hugs

ఈక్రమంలో ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్‌ను శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఒకరోజు జైలులో ఉండాల్సి వచ్చింది. బెయిల్‌పై విడుదలైన అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన కుటుంబంలో ఉద్వేగభరిత సంఘటనలు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్‌ను చూడగానే, ఆయన భార్య, పిల్లలు ఉద్వేగానికి లోనయ్యారు.

ఈక్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, భర్తను గట్టిగా హగ్ చేసుకుని ముద్దులు పెడుతూ కన్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై సమంత రియాక్ట్ అయింది. ఈ వీడియోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. 'చూసేటి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి' అనే 'పుష్ప' సినిమాలోని సాంగ్‌ని యాడ్ చేసింది. ఇక ఈ వీడియోకి 'నేనేమి ఏడ్వటం లేదు, ఐ యామ్ ఓకే' అనే క్యాప్షన్‌ను జత చేసింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+