సమంతను రిజెక్ట్ చేసిన ప్రభాస్..?
హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఏమాయ చేశావే'' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా సమంత పరిచియం అయింది. మహేష్ బాబుతో నటించిన ''దూకుడు'' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించింది.తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది. అయితే తెలుగులో పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించింది సమంత.
ఇదే సమయంలో యంగ్ హీరోలు నితిన్, నాగ చైతన్య,నానిలతో కూడా నటించింది.అయితే ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సమంత ఒక్క సినిమాలో కూడా నటించలేదు. వీరి కాంబోలో సినిమా వస్తుందేమో సినీ అభిమానులు ఎంతో అతృతుగా ఎదురు చూశారు. కానీ వీరిద్దరు కలిసి నటించలేదు. వీరిద్దరూ కలిసి నటించకపోవడానికి మెయిన్ రీజన్ ప్రభాస్ హైట్ అని తెలుస్తోంది. ప్రభాస్ 6 అడుగులు ఉంటే, సమంత హైట్ 5.2 అడుగులు. ఈ కారణంగానే వీరిద్దరితో కలిసి సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

అయితే ప్రభాస్ నటించిన 'సాహో' సినిమాలో హీరోయిన్‌గా చేసిన శ్రద్ధా కపూర్ , సమంత హైటే ఉంటుంది. ప్రభాస్ పక్కన శ్రద్ధా కపూర్ సెట్ అవ్వగా లేనిది, సమంత ఎందుకు సెట్ కాదని కొందరి వాదన. సమంతను ప్రభాస్ రిజెక్ట్ చేసి ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ సమంత - ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా రాకపోవడంపై సినీ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, సలార్-2 సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయనున్నాడు. ఇక సమంత విషయానికి వస్తే.. ''హనీ, బన్నీ'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు మరో బాలీవుడ్ సినిమాలో కూడా సమంత నటిస్తున్నారు. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో సమంత కాప్‌గా నటించారు. వచ్చే నెల ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications