Samantha: తల్లి కాబోతున్న సమంత.. అఫీషియల్ గా ప్రకటన
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. సమంత లీడ్ రోల్ లో నటించిన 'మా ఇంటి బంగారం' మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ టైమ్ లో సమంత బేబీ బంప్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దాంతో సమంత ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సమంత ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేశారు. కొద్దిరోజులు మెటర్నిటీ లీవ్ తీసుకుంటానని పేర్కొన్నారు. దాంతో అటు సెలబ్రిటీలు, ఇటు ఫ్యాన్స్ సమంతకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం సమంత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సమంత లీడ్ రోల్ లో నటించిన మా ఇంటి బంగారం మూవీ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ మూవీకి బీవీ నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత సమంత ఈ చిత్రం ద్వారా తిరిగి వెండితెరపై సందడి చేశారు. దీంతో హైదరాబాద్ లో మా ఇంటి బంగారం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సమంత, దర్శకురాలు నందినిరెడ్డి, నిర్మాత, సమంత భర్త రాజ్ నిడుమోరు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలోనే సమంత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని కన్ఫామ్ చేశారు. అందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. దీంతో ఫ్యాన్స్, మీడియా ప్రతినిధులు ఆమెకు కంగ్రాట్స్ చెప్పగా సమంత నవ్వుతూ థాంక్స్ చెప్పారు. తాను కొద్దిరోజులపాటు మెటర్నిటీ లీవ్ తీసుకుంటానని తెలిపారు.
తల్లి కాబోతున్న సమంత.. సినిమాలకు బ్రేక్ ఇస్తూ క్రేజీ అప్డేట్!#Samantha #RajNidimoru #Pregnancy #StarTalk #MaaIntiBangaram #FBTelugu pic.twitter.com/OkucnwTqBs
— TeluguFilmibeat (@TeluguFilmibeat) June 24, 2026
ఇక 2021 అక్టోబర్ లో సమంత.. అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత 2025, డిసెంబర్ 1 న దర్శకుడు రాజ్ నిడిమోరుతో రెండో వివాహం జరిగింది. కోయంబత్తూరులోని లింగభైరవి ఆలయంలో సంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. ఇక మా ఇంటి బంగారం మూవీని ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. అయితే గతంలో సమంత- నందిని రెడ్డి కాంబోలో 'ఓబేబీ', 'జబర్దస్త్' మూవీస్ వచ్చిన విషయం తెలిసిందే. అటు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం.. ఇటు ప్రెగ్నెన్సీ కావడంతో సమంత ఫుల్ జోష్ లో ఉన్నారు.












Click it and Unblock the Notifications