ఆ దర్శకుడితో సమంత చెట్టాపట్టాల్..రెండో పెళ్లి అతడితోనే ఫిక్స్..?
గత కొద్ది రోజులుగా హీరోయిన్ సమంత రెండో పెళ్లి గురించి విపరీతమైన ప్రచారం జరుగుతోంది. సమంత ..హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు.పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సమంత ఒంటరికి ఉంటున్నారు.
ఇదిలా ఉంటే సమంతకు రెండో పెళ్లికి సంబంధించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోను అని మాత్రం ఎక్కడా కూడా చెప్పడం లేదు. సమంత రెండో పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట సంచలనంగా మారింది. గత కొంతకాలంగా సమంత బాలీవుడ్‌లో ఓ దర్శకుడితో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ దర్శకుడు మరెవ్వరో కాదు.. రాజు నిడుమోరు. సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు.

వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
సరిగ్గా ఇదే సమయంలో సమంత మరోసారి ఆ దర్శకుడితో దర్శనం ఇచ్చి అందరికి షాకిచ్చింది. తాజాగా 'ఫ్యామిలీమ్యాన్ సీజన్3' వెబ్ సిరీస్ గురించి మేకర్స్ కీలక ఆప్డేట్ ప్రకటించారు. త్వరలోనే 'ఫ్యామిలీమ్యాన్ సీజన్3' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజు నిడుమోరుతో కలిసి సమంత దర్శనం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో సమంత ఆ దర్శకుడినే రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం మొదలైంది.అయితే ఈ ప్రచారంపై సమంతతో పాటు, అటు రాజు నిడుమోరు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం సమంత-రాజు నిడుమోరు కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications