ఆయనకు చాలు వద్దంటే కోపం వస్తోంది..అందుకే తప్పలేదు - సమంత
హీరోయిన్ సమంత క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సమంత, తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించింది. ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది.నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే వీరి మధ్య తీవ్ర విభేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య మరో వివాహం చేసుకోగా, సమంత మాత్రం సింగిల్‌గానే కొనసాగుతోంది. విడాకుల అనంతరం సమంత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇటీవలే సమంత ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆమె రియాక్ట్ అయ్యారు. తన 15 ఏళ్ళ కెరీర్ గురించి గుర్తు చేసుకుంటూ..అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు.. మరెన్నో చేదు అనుభవాలున్నాయంటూ చెప్పుకొచ్చింది. జీవితంలో కొన్ని విషయాలు ఎంత మర్చిపోవాలన్నా మరిచిపోలేమని.. కొన్ని మాత్రం ఇట్టే మరిచిపోతామంటూ సమంత తెలిపింది.

ఇదిలా ఉంటే గతంలో నాగ చైతన్యతో కలిసి ఉన్నప్పుడు సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకరోజు నాగ చైతన్య, అఖిల్ ,నేను కలిసి బ్రహ్మానందంగారి ఇంటికి వెళ్లామని, అక్కడ ఆయన తన అతిథి మర్యాదలతో చంపేశారని సమంత ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నెయ్యి, చికెన్ , వేస్తూనే ఉన్నారు. ఆయనకు చాలు అంటే కోపం వస్తోంది. దీంతో చేసేది లేక ఆయన పెట్టింది తిని వచ్చామని సమంత తెలిపింది.












Click it and Unblock the Notifications