శోభితతో రిలేషన్.. నాగ చైతన్యకు కౌంటరిచ్చిన సమంత
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.
అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే సమంతతో విడాకుల తీసుకున్న తరువాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి..తాజాగా నాగ చైతన్య సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోను శోభిత ధూళిపాళ లైక్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.
అయితే శోభిత ధూళిపాళ సైతం సరిగ్గా నాగ చైతన్య దిగిన లోకేషన్ లాంటి చోట ఫొటో దిగడం ఇప్పుడు పలు అనుమానాలకు దారి తీస్తోంది.ఇదిలా ఉంటే సమంత చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాగ చైత్యనకు సంబంధించిన జ్ఞాపకాలు తన దగ్గర ఉండకూడదని అనుకుందో లేక మరో కారణామో తెలియదు కానీ.. తన పెళ్లినాటి గౌనును రీమోడలింగ్ చేయించి షాకిచ్చింది.
రీమోడలింగ్ చేయించిన ఆ డ్రెస్సును సమంత ఓ అవార్డు కార్యక్రమంలో ధరించింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ..నాగ చైతన్య అంటే అంత కోపమా.. ఎందుకు అలా పెళ్లి నాటి గౌను చేయాల్సి వచ్చిందని సమంతను ప్రశ్నిస్తున్నారు. మరికొందరు శోభితతో నాగ చైతన్య రిలేషన్‌లో ఉన్నారనే కారణంతోనే సమంత ఇలాంటి పని చేసిందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సమంత పెళ్లినాటి గౌను ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications