కేటీఆర్ ట్వీట్‌కు సమంత అదిరిపోయే రిప్లై

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లో ఆయన స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా ఆయన్ను అభిమానించే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత అభివృద్ది విషయంలో కేటీఆర్ తనదైన పాత్రను పోషించారు. ముఖ్యంగా హైదరాబాద్ రూపురేఖలను మార్చడంలో కేటీఆర్ పాత్ర ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.

కేటీఆర్ ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత హైదరాబాద్ ఏమౌతుందో అని నగరవాసులు భయపడ్డారంటే సిటీలో ఆయన మార్క్ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎలా ఉన్నారో..అధికారంలో లేనప్పుడు కూడా ఆయన అదే విధంగా ఉన్నారు. ఇక కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే.

samantha reply on telangana ex minister ktr post

రోజుకు రెండు గంటలు సోషల్ మీడియాలో గడుపుతానని గతంలో కేటీఆర్ చెప్పడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజలు అడిగిన ప్రశ్నలకు సైతం కేటీఆర్ సమాధానం ఇస్తుంటారు. కేటీఆర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేశారు. ''జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా .. కానీ చిరునవ్వుతో ఎదుర్కొవాలి'' అంటూ తన పోస్ట్‌లో కేటీఆర్ రాసుకొచ్చారు. కేటీఆర్ చేసిన ఈ పోస్ట్‌పై హీరోయిన్ సమంత రియాక్ట్ అయ్యారు.

కేటీఆర్ పోస్ట్‌‌కు దండం పెట్టే ఎమోజీని షేర్ చేశారు సమంత. కేటీఆర్ పోస్ట్‌కు సమంత రిప్లై ఇవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కేటీఆర్ చేసిన ఈ పోస్ట్ సమంతకు కనెక్ట్ అయిందని అందుకే ఆమె స్పందించారని సమంత అభిమానులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సమంత చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసీడర్‌గా వ్యవహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+