అతనితో నా బంధం ప్రత్యేకం..సమంత ఓపెన్ కామెంట్స్
'ఏమాయ చేశావే' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన 'దూకుడు' సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా సమంత ఎదిగారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో సమంత నటించారు. ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. సమంత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
ఇదే సమయంలో సమంత కొంతకాలం మయసైటీస్ అనే వ్యాధితో బాధపడ్డారు. ఆర్యోగం సహకరించక పోవడంతో సమంత సినిమాలు చేయడం తగ్గించింది. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' తరువాత ఆమె మళ్లీ వెండితెర మీద కనిపించింది లేదు. బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో మాత్రం ఆమె కనిపించారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ 'సిటాడెల్ (హనీ, బన్నీ)' అనే వెబ్ సిరీస్‌లో నటించారు.ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు.

ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. హీరో వరుణ్ ధావన్‌తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత నటించారు. ప్రస్తుతం సమంత చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.సమంత నిర్మాతగా కూడా మారబోతున్నారు. ఆమె నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత ఓ వ్యక్తి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వ్యక్తి మరెవరో కాదు సమంత మొదటి సినిమా హీరో రాహుల్ రవీంద్రన్.కెరీర్ స్టార్టింగ్‌లో హీరోగా సినిమాలు చేసిన రాహుల్ రవీంద్రన్, తర్వాత దర్శకుడిగా మారారు.
తాజాగా సమంత రాహుల్ రవీంద్రన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ రవీంద్రన్‌తో తన అనుబంధాన్నిపంచుకుంది సమంత. తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు రాహుల్ తనకు అండగా నిలిచారని సమంత చెప్పుకొచ్చారు.ప్రతిరోజు తనతోనే ఉండి తనను జాగ్రత్తగా చూసుకున్నాడని ఆమె తెలిపింది. మా అనుబంధానికి పేరు పెట్టలేము. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. రాహుల్ నా స్నేహితుడా, సోదరుడా , కుటుంబ సభ్యుడా, రక్తసంబంధీకుడా అని చెప్పలేను అంటూ కాసింత భావోద్వేగంగా వెల్లడించింది.రాహుల్ రవీంద్రన్ గురించి సమంత చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications