అతని కోసమే ఒప్పుకున్నా..I Love You.. మొత్తానికి ఓపెన్ అయిన సమంత

హీరోయిన్ సమంత క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సమంత, తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించింది. ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది.నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే వీరి మధ్య తీవ్ర విభేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య మరో వివాహం చేసుకోగా, సమంత మాత్రం సింగిల్‌గానే కొనసాగుతోంది. విడాకుల అనంతరం సమంత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇటీవలే సమంత ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆమె రియాక్ట్ అయ్యారు. తన 15 ఏళ్ళ కెరీర్ గురించి గుర్తు చేసుకుంటూ..అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు.. మరెన్నో చేదు అనుభవాలున్నాయంటూ చెప్పుకొచ్చింది. జీవితంలో కొన్ని విషయాలు ఎంత మర్చిపోవాలన్నా మరిచిపోలేమని.. కొన్ని మాత్రం ఇట్టే మరిచిపోతామంటూ సమంత తెలిపింది.

Samantha reveals her relationship with Rahul Ravindran

ఇక తాను తిరిగి సినిమాల్లోకి రావడానికి కారణం ఒకే ఒక్కడని సమంత చెప్పుకొచ్చింది. మయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పుడు, రాహుల్ ప్రతిరోజు ఆమె ఇంటికి వచ్చి, ఆమెతో గేమ్స్ ఆడుతూ, అనారోగ్యాన్ని మరిచిపోయేలా చేశారని సమంత తెలిపారు. అంతేకాకుండా, మళ్లీ సినిమాలు చేయాలంటూ ఆమెను ప్రోత్సహించి, వెండితెరపైకి తిరిగి రావడానికి రాహులే ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. ఒక సందర్భంలో సమంత రాహుల్‌కు స్టేజ్ మీద I love you కూడా చెప్పారు.

రాహుల్ రవీంద్రన్, దర్శకుడిగా "చి.ల.సౌ." వంటి సూపర్ హిట్ సినిమాలను అందించారు. నటుడిగా 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సమంత, రాహుల్ ఇద్దరూ తమ మొదటి సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వారి స్నేహం నేటికీ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+