తల్లయిన సమంత: పేరు సైతం వెల్లడి
ప్రముఖ నటి సమంత తల్లయ్యారు. మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో దర్శకుడు రాజ్ నిడిమోరు దంపతుల ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. సమంత- రాజ్ నిడిమోరు తమ మొదటి సంతానంగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తమ కుమారుడికి దేవ్ నిడిమోరు.. అని నామకరణం చేసినట్లు సమంత వెల్లడించారు. తమ జీవితాలు ఎప్పుడూ లేనంత సంతోషంతో నిండిపోయాయంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ చిన్నారి జనన వివరాలతో కూడిన ఓ ఫొటోను కూడా సమంత షేర్ చేశారు.
సమంత, రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్ లో వివాహ బంధంతో ఒకటయ్యారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈశా యోగా సెంటర్ లో అతి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో యోగిక్ పద్ధతిలో వీరి వివాహ వేడుక జరిగింది. ఆ తర్వాత ఈ ఏడాది ప్రారంభంలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామనే తీపి కబురును వెల్లడించారు సమంత. ఇప్పుడు పండింటి బాబుకు జన్మనిచ్చినట్లు చెప్పారు. బుధవారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవించారామె. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రసవానికి కొన్ని రోజుల ముందు సమంత తమ నివాసంలో సాంప్రదాయం ప్రకారం కళావరణ అనే ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబోయే తల్లిని సాక్షాత్తూ దేవీస్వరూపంగా భావించి నిర్వహించే ఈ ప్రత్యేక క్రతువు ఇది. ఇందులోని ప్రతి మంత్రం, నివేదన వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సమంత స్వయంగా భక్తిశ్రద్ధలతో వివరించారు. తదనంతరం సీమంతం జరుపుకొన్నారు. రెండు కుటుంబాల బంధువులు దీనికి హాజరయ్యారు.
దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ఆమె సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సమంత, రాజ్ నిడిమోరుల బంధం వ్యక్తిగత జీవితానికే పరిమితం కాలేదు. సినిమాలపరంగా ప్రత్యేకమై కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.. వీరిద్దరు. ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ సమంత నటనకు జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సిటాడెల్: హనీ బన్నీ' సిరీస్‌లోనూ వీరి కాంబినేషన్ కొనసాగింది.
సమంత ఇటీవల నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మా ఇంటి బంగారం చిత్రంలో లీడ్ క్యారెక్టర్ ను పోషించారు. ఈ సినిమాకు రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై మాస్టర్ చెఫ్ తెలుగు వర్షన్‌కి యాంకర్ గా వ్యవహరిస్తోన్నారు. ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరొవైపు తల్లిగా నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications
