ఫైనల్లీ గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. ఎనౌన్స్‌మెంట్ చేసేసిందిగా..!
హీరోయిన్ సమంత ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కుడ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా సమంత ఎదిగారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో సమంత నటించారు. ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది.
నాగ చైతన్యతో విడాకులు అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళను నాగ చైతన్య ప్రేమించి వివాహం చేసుకున్నాడు. సమంత మాత్రం సింగిల్‌గానే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆ మధ్య సమంత రెండో పెళ్లిపై అనేక గాసిప్స్ తెర మీదకు వచ్చాయి. అయితే అవి కేవలం ప్రచారం వరకు మాత్రమే పరిమితం అయ్యాయి.

మయసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్న సమంత వరుస సినిమాలను లైన్లో పెడుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. సమంత నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై మొదటి ప్రాజెక్ట్‌గా 'శుభం' (shubam) సినిమాను తెరకెక్కించింది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన 'శుభం' సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది.
సమంత తన రెండో సినిమాను లైన్లో పెట్టారు. 'మా ఇంటి బంగారం' అనే సినిమాను నిర్మిస్తున్న సమంత, ఈ సినిమా కీలక పాత్రలో కూడా నటిస్తున్నారు.అయితే ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ సినిమా ఆప్డేట్ ఇచ్చారు సమంత. ఈ నెలలోనే 'మా ఇంటి బంగారం' సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని సమంత వెల్లడించింది.
చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లు రీఎంట్రీ గురించి అడుగుతున్న ప్రశ్నలకు ఈ మూవీతో మీ ముందుకు వచ్చి సమాధానం ఇవ్వబోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సమంత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications