అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి.. సమంత సంచలన కామెంట్స్
టాలీవుడ్, కోలీవుడ్ అనే భేదాలను చెరిపేసి, కేవలం తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను గెలుచుకున్న హీరోయిన్ సమంత. ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక చిత్రాలలో నటించి, ప్రతి సినిమాలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఏ మాయ చేశావే' సినిమాతో సమంత తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'జెస్సీ' పాత్రలో ఆమె చూపించిన అభినయం, అమాయకత్వం యువతను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత 'దూకుడు', 'ఈగ', 'అత్తారింటికి దారేది' వంటి వరుస విజయాలతో ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 'మనం', 'రంగస్థలం', 'మజిలీ', 'ఓ బేబీ' వంటి చిత్రాలు ఆమె నటనకు మరో నిదర్శనంగా నిలిచాయి. తమిళంలోనూ 'తేరి', 'మెర్సల్' వంటి పెద్ద చిత్రాలలో భాగమై, తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు.

హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సమంత, ఇండస్ట్రీలో ఒక ఆదర్శ జంటగా నిలుస్తుందని అభిమానులు ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు, వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. వారిద్దరి మధ్య తలెత్తిన అభిప్రాయభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అటు నాగ చైతన్య శోభితను వివాహం చేసుకోగా, సమంత మాత్రం ఒంటరిగానే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
కొంతకాలం పాటు 'మయసైటీస్' అనే అరుదైన వ్యాధితో బాధపడిన సమంత, సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ దశలో ఆమె చూపించిన ధైర్యం, పోరాట పటిమ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. ఇప్పుడు ఆ వ్యాధి నుంచి కోలుకుని, మళ్లీ సినిమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టి, కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు సమంత కొన్ని బ్రాండ్స్‌కు ప్రమోషన్స్ కూడా చేస్తుంటారు.దీనిలో భాగంగానే ఫీలిక్స్ అనే కంపెనీకి ప్రమోషన్ బాధ్యతలను చేపట్టింది. పిల్లులకు ప్రత్యేకంగా తయారు చేసిన ఆహారంను సమంత ప్రమోట్ చేస్తూ అందుకు సంబంధించిన యాడ్ వీడియోని కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఫీలిక్స్ నుండి నేను జాగ్రత్తగా ఉండాలి.. అతడు నా ఫోన్, లాప్టాప్, చార్జర్ ఆఖరికి నా స్క్రిప్ట్ను కూడా తినేస్తున్నారు. అతను చాలా డేంజర్. అతడు ఒక మాస్టర్ మైండ్. అతడి నుండి నేను జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది.
అతను అంటే మరెవరో కాదు..సమంత పెట్ క్యాట్.తన ఫోన్ , చార్జర్ ను, మొబైల్ ను, లాప్టాప్ ను అన్ని లాగేసుకొని తింటుంది అని చెబుతున్న సమంత ఆఖరికి ఫీలిక్స్ కంపెనీ తయారు చేసిన ఆహారాన్ని దానికి అందించి సేవ్ అయ్యింది. త దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది సమంత.












Click it and Unblock the Notifications