నా జీవితంలో బెస్ట్ హగ్ ఎవరిదో తెలుసా: సమంత
రెండు సంవత్సరాల నుంచి సినిమాలు చేయనప్పటికీ తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది సమంత. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకున్నారు ఈ జంట. తర్వాత నుంచి ఒంటరిగానే సమంత జీవిస్తోంది. నాగచైతన్య నాలుగోతేదీన శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్యను ఉద్దేశిస్తూ సమంత పరోక్షంగా సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతుంటుంది. అవి నాగచైతన్యను ఉద్దేశించే అని అందరికీ అర్థమవుతుంటుంది. అయితే నాగచైతన్య మాత్రం విడాకులు తీసుకున్న తర్వాత ఇంతవరకు సమంత గురించి ఎక్కడా ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. సమంత మాత్రం కాస్త దుందుడుకుగా వ్యవహరిస్తోందనే అభిప్రాయన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది
సామాజిక మాధ్యమాల్లో సమంత ప్రతిరోజు ఎంతో చురుగ్గా ఉంటుందనే విషయం తెలిసిందే. తాను ఎక్కడకు వెళ్లినప్పటికీ, ఏం చేసినప్పటికీ దానికి సంబంధించిన వివరాలు, ఫొటోలను షేర్ చేస్తుంటుంది. వాటిని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఓ ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసింది. అందంగా ఉన్న ఓ చక్కటి పాపను గాఢంగా సమంత హత్తుకుంది. ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. బెస్ట్ హగ్ ఎవర్ అంటూ వ్యాఖ్యను జోడించడంతో ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫొటో బాగుందంటూ కామెంట్లు పెడుతున్నారు.

సొంత బ్యానరులో ఓ సినిమా చేస్తోంది.
ప్రస్తుతం తన సొంత బ్యానరులో మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమా చేస్తోంది. అయితే ఇది రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకోవడంలేదు. ఇటీవలే ఆమె నటించిన వెబ్ సిరీస్ హనీబన్నీ విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. తాజాగా రక్త్ బ్రహ్మాండ్ పేరుతో మరో వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకోవడంపై మీ అభిప్రాయం ఏమిటని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నప్పటికీ సమంత మాత్రం వాటికి సమాధానం ఇవ్వడంలేదు. రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని గతంలోనే ప్రకటించినప్పటికీ ఆమెపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. వారితో, వీరితో డేటింగ్ లో ఉందంటూ వస్తుండటంతో వాటిని ఆమె సన్నిహితులు ఖండిస్తున్నారు. రెండు సినిమాలు ఒప్పుకుందని వార్తలు వస్తున్నాయికానీ వాటిని అధికారికంగా ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications