నాగ చైతన్యకు కౌంటర్ ..పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత
సమంత , నాగ చైతన్యల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరూ భావించారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అందరికి షాకిస్తూ నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్నాడు. సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య న్ శోభితతో రిలేషన్ మెయిన్‌టైన్ చేశాడు.
దీనిలో భాగంగానే వీరిద్దరు గత నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది వీరి పెళ్లితో ఒకటి కాబోతున్నారు. మరోవైపు సమంత మాత్రం సింగిల్‌గానే ఉంటూ వస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడుతో సమంత ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే అవి కేవలం ప్రచారం వరికే ఆగిపోయాయి. ఇదిలా ఉంటే సమంత తాజాగా కొన్ని ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె సోదరుడు డేవిడ్ ప్రభు వివాహం అమెరికాలో సెప్టెంబర్ 21న ఘనంగా జరగ్గా ఈ ఫొటోలను సామ్ షేర్ చేసింది. డేవిడ్, నికోల్‌తో క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి జరిగింది. ఈ వేడుకల్లో కుటుంబంతో కలిసి సామ్ చాలా కాలం తర్వాత అద్భుతమైన క్షణాలు గడిపినట్లు తెలుస్తోంది.

ఇక పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ ''అన్నింటికంటే మించింది ప్రేమ'' అనే క్యాప్షన్ జత చేసింది. సమంత తమ్ముడు పెళ్లి ఫొటోలు షేర్ చేసినప్పటికి.. అందులో రాసిన కొటేషన్ మాత్రం నాగ చైతన్యను ఉద్దేశించే పెట్టి ఉంటుందనే నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆరోగ్యం కోలుకోవడంతో సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. వరుసగా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారారామె. ''హనీ, బన్నీ'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు మరో బాలీవుడ్ సినిమాలో కూడా సమంత నటిస్తున్నారు. తాజాగా ఆమె మరో సినిమాను ఎనౌన్స్ చేశారు.












Click it and Unblock the Notifications