మొత్తానికి ఆ హీరోతో నటించడానికి ఓకే చెప్పిన సమంత..?
హీరోయిన్ సమంత ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కుడ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. నాగ చైతన్యతో విడాకులు అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయసైటీస్ వ్యాధి కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సమంత, ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా నాగచైత్యన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. ఈక్రమంలోనే బాలీవుడ్ 'సిటాడెల్ (హనీ, బన్నీ)' అనే వెబ్ సిరీస్‌లో నటించారు.
ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొత్తం ఆరు ఎపిసోడ్స్‌గానూ రెండు ఎపిసోడ్లు మాత్రమే ఆసక్తికరంగా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇదే సమయంలో హీరో వరుణ్ ధావన్‌తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత నటించారు. మరో బాలీవుడ్ సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఇదిలా ఉంటే సమంత తమిళ స్టార్ హీరో విజయ్‌తో మరోసారి నటించడానికి రెడీ అవుతుందట. సమంత గతంలో విజయ్‌తో మూడు సినిమాల్లో నటించింది.

కత్తి, తెరి, మెర్సల్ సినిమాల్లో విజయ్‌తో నటించింది సమంత. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు 4వ సారి దళపతి విజయ్ నటిస్తోన్న 69 సినిమాలో కూడా సమంత నటిస్తున్నట్లు చెబుతున్నారు. విజయ్ ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలో తన చివరి సినిమాలో నటిస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో , హెచ్. వినోద్ దర్శకత్వంలో నటించే సినిమానే తనకు చివరి చిత్రమని ఆయన ప్రకటించారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్డెను తీసుకున్నారు. అయితే కథను మలుపు తిప్పే పాత్ర కోసం సమంతను తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, అధికారిక ప్రకటన రాలేదు. సమంతా, విజయ్ సినిమాలన్నీ హిట్టే. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నారు.2025లో సినిమా విడుదల కానుంది.












Click it and Unblock the Notifications