సమంతలో ఇంత స్టామినా ఉందా..!
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.
అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేసుకున్నారు.విడాకులపై నాగచైతన్య పెద్దగా ఎప్పుడు మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. మొత్తానికి వీరి వైవాహిక జీవితం విషాదంగా ముగిసింది.

ఈ మధ్య సమంత నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. నాగచైత్యన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె.విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తరువాత సమంత మరో తెలుగు సినిమాలో నటించలేదు. 'సిటాడెల్' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో మాత్రం సమంత నటించారు.అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ వెబ్ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. మయసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత, ఇప్పుడిప్పుడే కోలుకుంది.దీంతో వరుస సినిమాలను లైన్లో పెడుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా సమంత జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమంత తన ఫిట్‌నెస్‌తో మరోసారి ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరిచింది. 110 కేజీలు ఎత్తి తన స్టామినా ఏంటో చూపించింది.మయోసైటిస్‌తో బాధపడుతున్న సమయంలో కూడా సమంత జిమ్‌కు వెళ్లింది.సమంత లైఫ్‌లో ఫిట్‌నెస్ ఒక భాగం.స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మంచి ఫుడ్ తీసుకుంటూ కోలుకుంది. తాజాగా పోస్ట్ చేసిన వీడియోతో సమంత ఏ లేవల్లో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతను ఇస్తుందో అందరికి అర్థం అయింది.ఇది చూసిన నెటిజన్లు సమంతలో ఇంత స్టామినా ఇందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications