హద్దులు దాటిన సమంత..స్టార్ హీరో తొడపై కూర్చొని ఫోజులు
హీరోయిన్ సమంత క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం సినిమాల్లో నటించింది.
అయితే విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' తర్వాత సమంత మళ్లీ వెండితెర మీద కనిపించింది లేదు. మయసైటీస్ వ్యాధి కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సమంత, ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా నాగచైత్యన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. ఈక్రమంలోనే బాలీవుడ్ ''హనీ, బన్నీ'' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు.

ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోంది. వరుణ్ ధావన్‌తో పాటు సమంత కూడా యాక్షన్ సీక్వెన్స్ చేసినట్టు స్పష్టం అవుతోంది. ఇదే విధంగా ఈ వెబ్ సిరీస్‌లో సమంత బొల్డ్‌గా కనిపించారనే టాక్ వినిపిస్తోంది. ట్రైలర్‌లో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నట్టు చూపించారు. దీంతో వెబ్ సిరీస్‌లో రొమాంటిక్ సీన్స్‌కు కొదవలేదని అర్ధం అవుతోంది. వరుణ్ ధావన్-సమంతల మధ్య బొల్డ్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఆ సీన్లలో వీరిద్దరు రెచ్చిపోయి నటించారనే టాక్ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలోని ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఇందులో ధావన్ కౌగిలిలో సమంత మునిగిపోయింది. గట్టిగా హత్తుకుని ఇరువురు బాండింగ్‌ని హైలైట్ చేశారు. ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ ధావన్‌తో కలిసి సమంత ఫొటో షూట్‌లో పాల్గొంది. ఈ ఫొటో షూట్‌లో సమంత హద్దులు దాటినట్టే కనిపిస్తోంది. హీరో వరుణ్ ధావన్ తొడపై కూర్చొని ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు చూసిన సమంత అభిమానులు షాక్ లో ఉండిపోయారు.సమంత ఏంటి మరీ ఇలా లైన్ క్రాస్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications