మొన్న నిధి అగర్వాల్.. ఇవాళ సమంతనూ వదల్లేదు.. ఇలా తయారయ్యారేంట్రా బాబు..!
ప్రముఖ నటి సమంతకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జరిగిన ఓ ఈవెంట్‌లో సమంత ఇబ్బంది పడ్డారు. ఫ్యాన్స్ తోసుకుంటూ ఆమెను చుట్టేయడంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. మొన్న నిధి అగర్వాల్ కు కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. ఇలాంటి ఘటనలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఫ్యాన్స్ .. తమ సెలబ్రిటీలను గౌరవించాలి కానీ ఇలా పబ్లిక్ లో చేయడంపై ఫైర్ అవుతున్నారు.
ఏమైందంటే.. తాజాగా ప్రముఖ నటి సమంత హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఫ్యాషన్ ప్రియులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులతోపాటుగా సమంత అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోని సామ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ కార్యక్రమంలో సమంతకు చేదు అనుభవం ఎదురైంది. సమంత షోరూమ్ నుండి బయటకు వచ్చి తన కారులో కూర్చోవడానికి ప్రయత్నించినప్పుడు జనాలు అదుపు తప్పిపోయి ఆమెపై పడిపోయారు. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు సమంత చీర కొంగును లాగినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో చూసిన సామ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలా తయారయ్యారేంట్రా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
మరోవైపు అటు నిధి అగర్వాల్ కూ ఇలాంటి ఘటనే ఎదురైంది. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ చిత్రం నుంచి రెండో సాంగ్ ను రిలీజ్ చేసేందుకు హైదరాబాద్ KPHBలోని లులూ మాల్ కు వచ్చింది చిత్ర యూనిట్. వీరిలో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఈవెంట్ అనంతరం హీరోయిన్ నిధి అగర్వాల్ బయటకు వెళ్తుండగా ఒక్కసారిగా ఫ్యాన్స్ వచ్చి ఆమెను చుట్టుముట్టారు. సెల్ఫీ కోసం ఎగబడ్డారు. దీంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. తాజాగా సమంత కు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
రీసెంట్ టైమ్ లో బెస్ట్ టీజర్.. నవ్వి నవ్వి పొట్ట చెక్కలే..!! -
ఆ హీరోతో నటించాలని ఉంది.. కానీ అలా మాత్రం కాదు !! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
‘ధురంధర్2’ దెబ్బకు ‘పుష్ప2’ రికార్డులు గల్లంతు -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
కొత్త బిజినెస్ షురూ చేసిన తెలుగు యాంకర్..! -
పెళ్లి కంటే సహజీవనం బెస్ట్: మెగా హీరోయిన్ షాకింగ్ కామెంట్స్











Click it and Unblock the Notifications