నాగ చైతన్యను ఎందుకు మోసం చేశావ్..నెటిజన్ ప్రశ్నకు సమంత అదిరిపోయే అన్సర్
ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. ఆ తరువాత తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాలు చేయడం తగ్గించింది. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' తరువాత ఆమె మళ్లీ వెండితెర మీద కనిపించింది లేదు. ఖుషీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సమంత..తన కొత్త సినిమా గురించి క్రేజీ ఆప్డేట్ ఇచ్చారు.

బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సమంత .. తాజాగా సిరీస్‌కు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ టైటిల్‌ను ''హనీ, బన్నీ'' పెట్టినట్టు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఇటీవల యోగాకు సంబంధించిన వీడియోను తన అకౌంట్‌లో షేర్ చేసింది.
ఈ వీడియోపై అందరూ పాజిటివ్‌గా రియాక్ట్ కాగా, ఓ నెటిజన్ మాత్రం సమంత వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రశ్నించాడు. మీ అమాయకపు భర్తను ఎందుకు మోసం చేశావని నాగ చైతన్యతో విడాకుల గురించి నేరుగానే సమంతను ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన సమంత ఈ ప్రశ్న మీకు మంచిది కాకపోవచ్చు.మీకు ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications