సమంతకు దర్శకుడి భార్య అదిరిపోయే కౌంటర్..అన్యాయంగా ఎవర్ని సొంతం చేసుకోకూడదు
గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరుతో సమంత రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు.
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

భార్యను కాదని రాజు నిడుమోరు సమంతతోనే ఎక్కువ కనిపిస్తున్నారు. సమంత ఎక్కడికి వెళ్తే అక్కడ రాజు నిడుమోరు దర్శనం ఇస్తున్నారు. సమంత తాజాగా రాజు నిడుమోరుతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను సమంత పోస్ట్ చేసింది.
మరోవైపు రాజు నిడుమోరు భార్య శ్యామల సైతం తన సోషల్ మీడియాలో భర్తకు సంబంధించిన ఎటువంటి అప్‌డేట్స్ ఇవ్వడం లేదు. భర్త బంధంపై పరోక్షంగా తన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా శ్యామల తన సోషల్ మీడియాలో రెండు పోస్ట్‌లను షేర్ చేశారు. ఓ పోస్ట్‌లో తెలివి తక్కువగా ప్రవర్తించడానికి బదులు తెలివిగా స్పందించాలని రాసుకొచ్చింది.

రెండో పోస్ట్‌లో అన్యాయంగా మీరు ఇక్కడ ఏది కూడా సొంతం చేసుకోకూడదు.. అలాగే ఏదీ కూడా మిమ్మల్ని సొంతం చేసుకోకూడదు అని తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. సమంత తన భర్తకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన తర్వాత రోజే , శ్యామల ఈ విధంగా పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. శ్యామల పరోక్షంగా రాజు నిడుమోరు సమంతల బంధం గురించే ఈ పోస్ట్‌ను షేర్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications