ప్రైవేట్ పార్ట్‌కు సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారు.. ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పలు సందర్భాల్లో బయటపెట్టడం జరిగింది. సీనియర్ నటి జయలలీత ఇటీవలే తన కెరీర్‌లో ఎదురైన వేధింపుల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇండస్ట్రీలో పెద్దవాళ్లుగా ఉన్న వ్యక్తుల చేతుల్లో కొన్నిసార్లు నలిగిపోవాలి వచ్చిందని నేరుగా చెప్పడం జరిగింది.

సినిమాలో ఆఫర్లు, కమిట్మెంట్‌ల గురించి బిగ్‌బాస్ నటి హిమజ సైతం స్పందించారు. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్లు వస్తాయనేది ఓ రూమర్ మాత్రమే అని హిమజ తెలిపారు. కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లందరికీ ఆఫర్స్ రావడం లేదు.. అలాగే అవకాశాలు వచ్చిన వారందరూ కమిట్మెంట్ ఇచ్చినట్టు కాదని హిమజ చెప్పుకొచ్చారు. 1990ల్లో ఆమని టాప్ హీరోయిన్‌గా కొనసాగారు. ఆమె కూడా తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవం గురించి వివరించారు. ఓ తమిళ దర్శకుడు నన్ను ఏకంగా స్ట్రెచ్ మార్క్స్ మీకు ఉన్నాయా లేదో చూపించండి అంటూ బహిరంగంగా అడిగాడు..దీంతో అక్కడ నుంచి లేచి వెళ్లిపోయానని ఆమని చెప్పారు.

Sameera Reddy was pressured for breast enhancement surgery

తాజాగా ఎన్టీఆర్ హీరోయిన్ సమీరా రెడ్డి కూడా తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. కెరీర్ తొలినాళ్లలో బ్రెస్ట్‌ గురించి విపరీతమైన చర్చ సాగేదని..ఆ సమయంలో చాలా మంది తనని సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారని చెబుతూ ఎమోషనల్ అయ్యింది.హీరోయిన్‌గా సినిమాలు చేసే సమయంలోనే శరీరంలో మార్పులు వచ్చాయి.ఆ సమయంలో అందరూ నన్ను బూబ్ జాబ్ సర్జరీ సర్జరీ చేయించుకోమని ఒత్తిడి తెచ్చారు.చాలా మంది చేయించుకుంటున్నారు నీకేమైంది అని నన్ను పదే పదే ఇబ్బంది పెట్టారు.నాకు అది ఇష్టం లేదు అని చెప్పినా వినేవారు కాదు.ఆ సమయంలో చాలా బాధపడ్డాను అని ఎమోషనల్ అయ్యింది. నేను ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకునే వారిని తప్పుపట్టను.కానీ నా సమస్యను నేను పరిష్కరించుకోగలను అని సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+