Sunny Leone: సన్నీ లియోన్ కొత్త యాపారం..ఇక్కడన్ని హాటే..!
Sunny Leone Restaurant: ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సన్నీలియోన్ రెస్టారెంట్ ప్రారంభించినట్లు సమాచారం.దీంతో సన్నీలియోన్ నటిగానే కాకుండా రెస్టారెంట్ ఓనర్‌గా కూడా మారిపోయింది.మరో బిజినెస్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యింది.
22 జనవరి 2024లో కొన్ని వందలమంది అభిమానుల మధ్య సన్నీ లియోన్ ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించనట్లు పలు మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.రెస్టారెంట్ ఇలా స్టార్ట్ అయ్యిందో లేదో సన్నీలియోన్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి రుచులను ఆస్వాదిస్తున్నారు.ఇంతకీ ఈ రెస్టారెంట్ పేరు ఏంటని అనుకుంటున్నారా.. చీక లోక.

సన్నీ రెస్టారెంట్ పేరు 'చికా లోకా':
ప్రముఖ నటి సన్నీలియోన్ నోయిడాలోని సెక్టార్ 129లోని వన్ 29 సమీపంలో తన విలాసవంతమైన రెస్టారెంట్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. సన్నీకి చెందిన ఈ రెస్టారెంట్ పేరు 'చీక లోక'. వారు దీనికి స్పానిష్ భాషలో పేరు పెట్టారు. చీక లోక అంటే 'వెర్రి అమ్మాయి' అని అర్థం.
మీరు ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేయవచ్చు:

సన్నీలియోన్ ప్రారంభించిన ఈ రెస్టారెంట్‌లో ఫుడ్ సరసమైన ధరలకే అందుబాటులో ఉన్నట్లు సమాచారం.అంతేకాదు ఈ టేస్టీ ఫుడ్ కావాలనుకునేవారు ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేయొచ్చట. ఒక వేళ మీరు నోయిడాకు వెళుతున్నట్లయితే కచ్చితంగా సన్నీ రెస్టారెంట్‌ను విజిట్ చేసి అక్కడి ఫుడ్‌ను టేస్ట్ చేయాల్సిందే. ఇక Eazydiner మరియు Swiggy యాప్‌లను ఉపయోగించి చీక లోక రెస్టారెంట్ నుంచి ఆహారం ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకోవచ్చు.
సమోసా రూ. 195కి దొరుకుతుంది:
చీక లోక రెస్టారెంట్‌లో ఫుడ్ రేట్ గురించి చెప్పాలంటే, ఇక్కడ మీకు పుల్ల్డ్ చికెన్ సమోసా రూ. 195కి లభిస్తుంది, ఇది అతి తక్కువ ధర. అలాగే చికెన్ టిక్కా మసాలా వాఫ్ఫల్స్ రూ.495కే లభిస్తున్నాయి. సన్నీ రెస్టారెంట్ మెనూలోని అన్ని ఆహార పదార్థాలు రూ. 1000లోపే ఉన్నాయని సమాచారం. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని సన్నీలియోన్ ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించినట్లు చెబుతున్నారు.
రెస్టారెంట్ ప్రతిరోజూ మధ్యాహ్నం 12:00 నుండి రాత్రి 11:30 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది.ఇంకెందుకు ఆలస్యం.. ఎప్పుడైనా ఢిల్లీ లేదా నోయిడా పరిసర ప్రాంతాలకు వెళ్లినట్లయితే కచ్చితంగా సన్నీ లియోన్ రెస్టారెంట్‌కు వెళ్లి ఫుల్‌గా ఫుడ్ లాగించేయండి.












Click it and Unblock the Notifications