ఎప్పుడూ చేయని వైల్డ్ అండ్ రస్టిక్ రోల్ లో టాలీవుడ్ యంగ్ హీరో- టీజర్ విడుదల.. !!

టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు.. శర్వానంద్. ఈసారి సరికొత్త మాస్, రస్టిక్ అవతారంలో ప్రేక్షకులను అలరించబోతోన్నాడు. అతను హీరోగా నటిస్తోన్న సరికొత్త పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. భోగి. ఈ క్రేజీ ఫిల్మ్ కు సంబంధించిన అధికారిక టీజర్‌ విడుదలైంది. సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రం యూనిట్. సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటివరకు శర్వానంద్‌లో చూడని భిన్నమైన ఇంటెన్స్ రోల్‌ను ఈ సినిమా ద్వారా ఆవిష్కరించనున్నాడు దర్శకుడు సంపత్ నంది. కంప్లీట్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతోంది. పాత కాలం నాటి వాతావరణంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై తెలుగు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తింది. టీజర్ చూస్తేనే సినిమాలోని గాఢత అర్థమవుతోంది. పల్లెటూరి వాతావరణం, అక్కడి కక్షలు, కార్పణ్యాల తాలూకూ తీవ్రతను ఈ టీజర్ లో అద్భుతంగా చూపించారు.

Sampath Nandi Bhogi Film Teaser Released as Sharwanand s Never-Seen Role as Anupama Parameswaran

ఇందులో శర్వానంద్ రస్టిక్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో రూపొందించిన యాక్షన్ బ్లాకులు మాస్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. తన కెరీర్‌లోనే ఒక భిన్నమైన వైల్డ్ క్యారెక్టర్‌ను శర్వానంద్ పోషిస్తున్నట్టు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. సినిమాటోగ్రాఫర్ కిశోర్ కుమార్ ఆరోకియా అందించిన కెమెరా పనితనం అద్భుతం అనిపించింది. పాతకాలపు గ్రామీణ జీవనాన్ని, యాక్షన్ సీన్లను ఎంతో సహజంగా తెరకెక్కించారాయన.

ఒంటి నిండా గాయాలను చూపించిన నేహా బోరా
ఒంటి నిండా గాయాలను చూపించిన నేహా బోరా

దీనికి తోడు ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన గూస్ బంప్స్ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రాణం పోసింది. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె డిజైన్ చేసిన సెట్లు సినిమాకు మరింత వెయిట్ యాడ్ చేశాయి. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. కథాగమనంలో వీరి పాత్రలు ఎంతో కీలకమైనవనే టాక్ వినిపిస్తోంది.

శరత్ శ్వాత్, అవినాష్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ ఏడాది నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సంపత్ నంది మార్క్ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్, శర్వానంద్ సరికొత్త లోకల్ యాక్షన్ పర్ఫార్మెన్స్ కలయికలో వస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+