32 ఏళ్ల వయసు.. ఇప్పటికీ నేను వర్జిన్‌నే: బిగ్ బాస్ బ్యూటీ

బాలీవుడ్ బిగ్ బాస్ ఓటీటీ-3 విజేత, ప్రముఖ టెలివిజన్ నటి సనా మక్బూల్ మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఆమె చేసిన సెన్సేషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాను ఇప్పటివరకు ఎవరితోనూ రిలేషన్ షిప్‌లో లేనని చెప్తూ.. అందుకు గల కారణాలను బయటపెట్టింది. 32 ఏళ్ల సనా మక్బూల్ చెప్పిన సమాధానాలు విని ఇంటర్వ్యూ చేసిన యాంకర్‌తో పాటు నెటిజన్లు కూడా ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు.

ఆ సినిమా నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది
ఆ సినిమా నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది

ఇటీవల ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సనా మక్బూల్ తన వర్జినిటీపై ఓపెన్ అయింది. "నేను ఇంకా వర్జిన్‌నే బేబీ.. ఇది నిజం!" అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అంతటితో ఆగకుండా, తాను ఇప్పటివరకు కనీసం ఎవరికీ 'కిస్' కూడా చేయలేదని, ఎలాంటి హుకప్‌లు లేదా శారీరక సంబంధాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని స్పష్టం చేసింది. ఇది మీ మతం వల్ల తీసుకున్న నిర్ణయమా అని అడగ్గా.. అలాంటిదేమీ లేదని, ఇది పూర్తిగా తన వ్యక్తిగత ఇష్టమని సనా బదులిచ్చింది.

Sana Makbul Bold Confession I Am Still A Virgin Baby Reveals Why She Avoids Relationships

ఇంత వయసు వచ్చినా ఎవరితోనూ ప్రేమలో పడకపోవడానికి గల అసలు కారణాన్ని కూడా సనా మక్బూల్ ఈ సందర్భంగా వివరించింది. "ప్రస్తుత రోజుల్లో జనాలు చాలా సులభంగా గుండెల్ని ముక్కలు చేస్తున్నారు. అందుకే నాకు ప్రేమ అంటేనే భయం వేస్తుంది" అని ఆమె పేర్కొంది. ఎవరినైనా అంత తేలిగ్గా నమ్మడం తన వల్ల కాదని, ఒక్కసారి మనసు విరిగిపోతే మళ్లీ జీవితంలో ఎవరినీ విశ్వసించలేమని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. గతంలో ఒకరితో ఉన్న అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. తాను కెరీర్‌లో సక్సెస్ సాధిస్తుంటే ఆ పార్ట్‌నర్ తట్టుకోలేకపోయాడని, అలాంటి మనస్తత్వాల వల్లే తాను ఒంటరిగా ఉండటానికి మొగ్గు చూపానని తెలిపింది.

కేవలం గ్లామర్ కోసమేనా?: స్పోర్ట్స్ సినిమాలో ఈ హాట్ షో ఏంటి సామీ?
కేవలం గ్లామర్ కోసమేనా?: స్పోర్ట్స్ సినిమాలో ఈ హాట్ షో ఏంటి సామీ?

తన ఫేవరెట్ నటి చేసిన ఈ బోల్డ్ అండ్ షాకింగ్ ఇంటర్వ్యూ చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. గ్లామర్ ఫీల్డ్‌లో ఉంటూ ఇలాంటి నిర్ణయంతో ఉండటం నిజంగా గ్రేట్ అని కొందరు ఆమెను అభినందిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ అంటూ పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుతం సనా మక్బూల్ చేసిన కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+