నటి సంచిత మృతి వెనుక? సోదరుడి సంచలన ఆరోపణలు!
ప్రముఖ నటి సంచిత ఉగాలే ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఆకస్మిక మరణంపై ఆమె సోదరుడు ఆకాష్ ఉగాలే సంచలన ఆరోపణలు చేశారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు కాస్టింగ్ ఏజెంట్లు తన సోదరిని తీవ్రంగా మానసిక వేధింపులకు గురిచేశారని.. అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని ఆకాష్ ఉగాలే ఆరోపించారు. ఇండస్ట్రీలో ఉన్న కొందరు వ్యక్తుల ఒత్తిడి కారణంగానే సంచిత గత కొంతకాలంగా తీవ్ర డిప్రెషన్‌లో ఉందని ఆకాష్ వెల్లడించారు.
మీడియాతో మాట్లాడిన ఆకాష్ ఉగాలే.. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు కనిపించిన ఒక రీల్‌ను ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వీడియోపై తన సోదరి సంచిత ప్రొఫైల్ ఫోటోను జత చేస్తూ ఒకరు సోషల్ మీడియాలో రీల్ పోస్ట్ చేసిందని.. అది చూసి తాను షాక్‌కు గురయ్యానని వెల్లడించారు. దీనిపి సంచిత ఫ్రెండ్స్‌ను ఆరా తీయగా.. ఇండస్ట్రీలోని కొందరు కాస్టింగ్ ఏజెంట్లు ఆమెను చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నట్లు, మానసికంగా వేధిస్తున్నట్లు తెలిసిందని ఆకాష్ ఉగాలే పేర్కొన్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని గుర్తు చేస్తూ ఆకాష్ ఉగాలే భావోద్వేగానికి లోనయ్యారు. "బాలీవుడ్ ఇండస్ట్రీలోని తీవ్ర ఒత్తిడి తట్టుకోలేక 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. సరిగ్గా అదే రోజు (జూన్ 14న) అదే కారణంతో నా సోదరి కూడా బలవన్మరణానికి పాల్పడింది" అని ఆకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్లామర్ ప్రపంచం వెనుక పెద్ద ఎత్తున ప్రభావవంతమైన, బలమైన వ్యక్తుల ఒత్తిళ్లు ఉంటాయని, ఇది మనుషులను లోపల నుంచి పూర్తిగా కుంగదీస్తుందని చెబుతూ.. తన సోదరి మరణంపై లోతైన విచారణ జరపాలని సంచిత సోదరుడు ఆకాష్ ఉగాలే డిమాండ్ చేశారు.
#WATCH | Nalasopara, Maharashtra | API Vinod Bagh of Achole Police Station says, "A case has been reported in the jurisdiction of Acholi Police Station. Miss Sanchita Ugale, 22, died by suicide by hanging herself in her own home... The reason for the death will be determined in… https://t.co/L7JusjMW1g pic.twitter.com/o0AESRpPDO
— ANI (@ANI) June 15, 2026
జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సంచిత ఉగాలే ఉరేసుకుని మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంచిత తండ్రి మచ్చింద్ర ఉగాలే ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంచిత ఉగాలే పలు జనాదరణ పొందిన హిందీ టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 'కుంకుమ్ భాగ్య' సీరియల్‌లో దియా టాండన్ పాత్రతో పాటు, 'వాగ్లే కీ దునియా'లో రుచితా జెట్లీ పాత్రలో నటించి మెప్పించారు. దంగల్ టీవీ షో 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' లోనూ ఆమె నటించారు. ఇవే కాకుండా, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఛావా' చిత్రంలో తారాబాయి పాత్రను కూడా ఆమె పోషించారు. సంచిత మరణంతో ఆమె కుటుంబంతో పాటు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.












Click it and Unblock the Notifications