సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో హీరోగా ధోని..ట్రైలర్ చూస్తే గూస్‌బంప్సే

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తీసింది మూడు సినిమాలే అయినప్పటికీ మనోడు స్టార్ దర్శకుల జాబితాలోకి చేరాడు.అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు.తెలుగు సినిమా చరిత్రలో అర్జున్ రెడ్డి సినిమా కల్ట్ సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ప్రమోషన్ పొందాడు. చాలాకాలంగా హిట్ లేకపోయినప్పటికీ, విజయ్ దేవరకొండకు ఇంకా ఆఫర్లు వస్తున్నాయంటే అర్జున్ రెడ్డి సినిమానే కారణం.

ఇక ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా తెరకెక్కించాడు సందీప్ రెడ్డి వంగా.బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ఇక రణబీర్ కపూర్‌తో తెరకెక్కించిన యానిమల్ సినిమాతో బాలీవుడ్ జనాలు పిచ్చోళ్లు అయిపోయారు.యానిమల్ సినిమాతో బాలీవుడ్ జనాలకే కాకుండా అక్కడి హీరోలకు సైతం మెంటల్ ఎక్కించాడు మనోడు. దీంతో అతనితో సినిమాలు చేయాలని స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే మూవీని తెరకెక్కించడానికి ప్రణాళికలు చేసుకుంటున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.

Sandeep Reddy Vanga Dhoni s ad video goes viral

అయితే ఈలోపు అతనికి ఊహించని అవకాశం లభించింది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి ఓ యాడ్ చేసే అవకాశం సందీప్ రెడ్డి వంగాకు దక్కింది. ఓ ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీ యాడ్ కోసం వీరిద్దరు కలిసి పని చేశారు.తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో యానిమల్ సినిమాలో హీరో క్యారెక్టర్ రోల్‌లో ధోని ఎలక్ట్రికల్ సైకిల్ పై రావడాన్ని సందీప్ రెడ్డి వంగా షూట్ చేయడం చూడవచ్చు. వరుసగా నాలుగు కార్లు రయ్ రయ్ మంటూ వస్తాయి. అందులోంచి ధోని స్టైలిష్‌గా, కళ్లకు నల్లని గాగుల్స్ పెట్టుకుని బ్లూ కోట్‌తో కారు డోర్ తీసుకుని దిగుతాడు.

ధోని సైకిల్‌ను నడిపించుకుంటూ వెళ్లడం ఆ యాడ్‌లో చూడవచ్చు. అంతలోనే దర్శకుడు సందీప్.. కట్ కట్ అంటూ గట్టిగా ఓ విజిల్ వేస్తాడు. మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్ అంటూ సందీప్ చెబుతాడు. ఈ యాడ్ చివర్లో 'యానిమల్' మూవీ లాస్ట్ షాట్‌ని ఇమిటేట్ చేయడం హైలెట్‌గా నిలిచింది. గతంలో ఎప్పుడూ కూడా ధోని ఇలా ఒక సినిమాలోని సన్నివేశాన్ని అనుసరిస్తూ యాడ్స్ చేయలేదు. మొట్టమొదటిసారి అలాంటి యాడ్ చేయడంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ధోని సినిమాలకు సరిపోతాడని, ఐపీఎల్ నుండి కూడా రిటైర్ అయిపోయాక ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇవొచ్చంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+