సెంట్రల్ జైల్లో స్టార్ హీరోను కలిసి బోరున విలపించిన భార్య, ఏం చెయ్యాలో చెప్పండి ?
బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్న హీరో దర్శన్‌ను పరామర్శించేందుకు వచ్చిన విజయలక్ష్మి ఆమె వెంట బ్యాగ్ లో పలు వస్తువులను తీసుకెళ్లింది. అయితే దర్శన్ భార్య విజయలక్ష్మీ తీసుకెళ్లిన ఆ బ్యాగ్‌లో ఏముంది? ఆ బ్యాగ్ ను జైలు లోపలికి అనుమతించారా? అనే విషయంప మంగళవారం తీవ్రస్థాయిలో చర్చ జరిగింది.చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో హీరో దర్శన్ అండర్ ట్రయల్ ఖైదీగా బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్నాడు.
విచారణ ఖైదీగా బళ్లారి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న హీరో దర్శన్‌ను కలిసేందుకు ఆయన భార్య విజయలక్ష్మి ,దర్శన్ బావమరిది హేమంత్ బళ్లారి సెంట్రల్ జైలుకు వెళ్లారు. మధ్యాహ్నం వచ్చిన వాళ్లను సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సెక్యూరిటీ సెంటర్‌లో తనిఖీలు చేశారు. ఖైదీలను పరామర్శించేందుకు వచ్చిన దర్శన్ భార్య, ఆయన బావమరిదితో పాటు మరో నటుడు తీసుకు వచ్చిన రెండు బ్యాగులు, వారి ఆధార్ కార్డు, వస్తువులను జైలు భద్రతా సిబ్బంది పరిశీలించి సందర్శకుల గదిలోకి పంపించారు.

కోర్టు ఆదేశం మేరకు దర్శన్ ను ఆయన భార్య, బావమరిది కలిశారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో విలాసవంతమైన సౌకర్యాలు అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ గ్యాంగ్‌ను కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ జైళ్లకు తరలించారు. మరోవైపు నటుడు దర్శన్‌ను బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు. బళ్లారి జైలులో ఉన్న నటుడు దర్శన్‌ను ఆయన కుటుంబ సభ్యులు, చాలా దగ్గర బంధువులు మాత్రమే పరామర్శించాలని కోర్టు ఆదేశించింది.
అయితే కోర్టు విచారణలో దర్శన్ దగ్గరకు ఆయన సన్నిహితుల వెళ్లేందుకు అనుమతించాలన్న దర్శన్ తరపు న్యాయవాది అభ్యర్థనను కోర్టు మన్నించింది. ఈ నేపథ్యంలో దర్శన్ భార్య విజయలక్ష్మితో పాటు బావమరిది హేమంత్, దర్శన్ సన్నిహిత నటుడు ధన్వీర్ కూడా బళ్లారి జైలుకు వెళ్లి హీరోను కలిశారు.
నటుడు దర్శన్‌కు ఆయన సతీమణి విజయలక్ష్మి ఓ బ్యాగ్‌ని అందించారు. డ్రై ఫ్రూట్స్, బిస్కెట్లు, బట్టలు, టూత్ పేస్టు, సబ్బు, పండ్లు, బేకరీ స్నాక్స్ హీరో దర్శన్ కోసం తెచ్చారని తెలిసింది. దాదాపు మూడు నెలలుగా జైలులో ఉన్న నటుడు దర్శన్ ఇంట్లో భోజనం చేసేందుకు కోర్టు నుంచి అనుమతి లభించలేదు. హీరో దర్శన్ ను చూసిన వెంటనే ఆయన భార్య విజయలక్ష్మి బోరున విలపించారని తెలిసింది.












Click it and Unblock the Notifications