షోయాబ్‌కు షాకిచ్చిన సానియా మీర్జా
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకుల తరువాత తొలిసారి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. గతంలో విడాకులకు సంబంధించి పరొక్షంగా హింట్ ఇస్తూ ఓ పోస్ట్ చేసింది.పెళ్లి కష్టం.. విడాకులు కష్టమే. మీరు కఠినంగా ఉండి, సరైన దాన్ని ఎంచుకోండి. అలాగే లావుగా ఉండటం కష్టమే.. ఫిట్‌గా ఉండటం కూడా కష్టమే. అప్పు ఉండటం కష్టం. ఆర్థిక నియమం పాటించడమూ కష్టమే. మీరు సరైన దాన్ని ఎంచుకోండి.
ఇతరులతో ఎటువంటి సమాచారం లేకుండా ఉండటం కష్టమే అప్పుడే జీవితం కఠినంగా మారుతుంది. మనం ఎప్పుడూ మన కష్టాన్నే నమ్ముకోవాలి అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన తరువాత సానియా మీర్జా తన భర్తకు విడాకులు ఇస్తుందని అందుకే ఇలాంటి పోస్ట్ చేసిందని నెటిజన్లు కామెంట్ చేశారు. దీనిని నిజం చేస్తూ..పాకిస్థాన్‌కు చెందిన హీరోయిన్ సనా జావేద్‌ను వివాహం చేసుకుని షోయబ్ అందరికి షాకిచ్చాడు.

దీంతో సానియా విడాకులు తీసుకుందని అందరికి అర్థం అయింది. విడాకులపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. సంప్రదాయం ప్రకారమే సానియా మీర్జా తన భర్త నుంచి విడాకులు తీసుకుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే విడాకుల తరువాత సానియా తొలిసారి ఓ పోస్ట్ చేశారు. అయితే ఆమె విడాకుల గురించి ఎలాంటి కామెంట్ చేయకుండా కేవలం తన ఫొటోతో పాటు దానికి ఓ క్యాప్షన్‌ను జత చేసి ఓ పోస్ట్ చేసింది.
అద్దంలో తనని తాను చూసుకుంటూ ఫొటోకు ఫోజిచ్చింది. దానికి 'రిఫ్లెక్ట్' అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. అయితే ఆ ఒక్క పదంలో లోతైన భావం దాగి ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రిఫ్లెక్ట్ అంటే కేవలం ప్రతిబింబించు అనే అర్థమే రాదని, 'లోతుగా లేదా జాగ్రత్తగా ఆలోచించండి' అనే అర్థం కూడా వస్తుందని కామెంట్లు చేస్తున్నారు. తన పోస్ట్‌లో ఎక్కడా కూడా తన విడాకుల గురించి ప్రస్తావించకుండా మాజీ భర్త షోయాబ్‌కు గట్టి షాకే ఇచ్చిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications