Sania Mirza : సానియా మీర్జా కొంపముంచిన ఆ ఎఫైర్..?
భర్త షోయబ్ మాలిక్‌తో విడిపోవడంపై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంచలన కామెంట్స్ చేశారు. సానియా మీర్జా తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి భర్త షోయబ్‌తో ఉన్న ఫొటోలను తొలగించినప్పుడే సానియా మీర్జా విడాకులు తీసుకుంటుందని అందరు భావించారు. ఇదే సమయంలో షోయబ్ మాలిక్ సైతం ట్విట్టర్ అకౌంట్ నుంచి తన భార్య సానియా మీర్జా పేరును తొలగించడం జరిగింది.

దీంతో ఈ జంట విడాకులు తీసుకోవడం ఖాయమంటూ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన హీరోయిన్ సనా జావేద్‌ను వివాహం చేసుకుని షోయబ్ అందరికి షాకిచ్చాడు. అయితే సనా జావేద్‌తో షోయబ్ గత కొంతకాలంగా ఎఫైర్ నడుపుతున్నాడనే రూమర్స్ ఉన్నాయి. అటు షోయబ్ కూడా భార్యతో కన్నా సనా జావేద్‌తో తరుచూ కనిపిస్తుండటంతో ఈ రుమర్స్ నిజమే అని అంతా భావించారు.

సానియా మీర్జాకు విడాకులు ఇవ్వకుండానే సనా జావేద్‌తో షోయబ్ సహజీవనం చేస్తున్నాడని..దీని కారణంగానే సానియా షోయబ్ నుంచి విడిపోయిందని తెలుస్తోంది. సనా జావేద్‌ను షోయబ్ వివాహం చేసుకోవడంతో సానియా మీర్జా వైవాహిక జీవితం విషాదాంతంగా మారింది. సనా జావేద్‌తో భర్త ఎఫైర్ కారణంగానే సానియా షోయబ్ మాలిక్ నుంచి విడాకులు తీసుకుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే విడాకులపై సానియా తొలిసారి స్పందించారు. జీవితంలో పెళ్లి కష్టమైనదే, విడాకులు కష్టమైనదే వీటిలో మీకు ఏది కష్టంగా అనిపిస్తే దాన్ని ఎంచుకోండి అంటూ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై తాజాగా సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. సంప్రదాయం ప్రకారమే సానియా మీర్జా తన భర్త నుంచి విడాకులు తీసుకుందని ఆయన తెలిపారు. షోయబ్ మాలిక్‌ను 2010లో సానియా ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇజాన్ మీర్జా అనే మగబిడ్డ ఉన్నాడు.












Click it and Unblock the Notifications