ఏంటీ సానియా మీర్జా ఇంత ఆస్తి సంపాదించిందా..?
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణీ సానియా మీర్జా వైవాహిక జీవితం విషాదాంతంగా ముగిసిన సంగతి అందరికి తెలిసిందే. సానియా మీర్జా తన 15 ఏళ్ల దాంపత్య జీవితానికి గుడ్ బై చెప్పింది. భర్త షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకోవడంతో .. అతనితో సానియా మీర్జా బంధం తెగిపోయినట్టు అయింది. షోయబ్ మాలిక్ పాకిస్థాన్‌కు చెందిన హీరోయిన్ సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు.
సనా జావేద్‌తో షోయబ్ మాలిక్ ఎఫైర్ కారణంగానే సానియా మీర్జా భర్తతో విడిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విడాకులపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. సంప్రదాయం ప్రకారమే సానియా మీర్జా తన భర్త నుంచి విడాకులు తీసుకుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే సానియా మీర్జా ఆస్తులకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

1999లో కెరీర్ ప్రారంభించిన సానియా మీర్జా ఆస్తులను గట్టిగానే కూడబెట్టినట్టు లెక్కలు చెబుతున్నాయి. టెన్నిస్ మొదలు పెట్టిన తరువాత సానియా ఆస్తులు అమాంతం పెరిగాయి. 2023 నాటికి ఆమె నికర సంపద $26 మిలియన్లు. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.210 కోట్లకు సమానం. వీటితో పాటు...మరెన్ని నికర ఆస్తులు ఉన్నట్టు సమాచారం.
టెన్నిస్ కోర్ట్‌లో సాధించిన విజయాలకు వచ్చిన ఆదాయం కంటే వ్యాపార ప్రకటనల ద్వారా సానియాకు వచ్చిన ఆదాయమే ఎక్కువని తెలుస్తోంది. పలు బ్రాండ్స్‌కు ఎండార్స్‌మెంట్స్ ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించింది. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. 2015లో ప్రపంచ నంబర్ 1గా ఉన్న సమయంలో ఒక్కో వ్యాపార ప్రకటనకు రూ. 60 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు వసూలు చేసిందని సమాచారం.

సానియా మీర్జా వ్యాపార ఎండార్స్‌మెంట్స్ జాబితాను ఓసారి పరిశీలిస్తే.. టాటా టీ, టీవీఎస్ స్కూటీ, బోర్న్‌విటా వంటి బ్రాండ్‌లు ఉన్నాయి.ప్రస్తుతం జిందా తిలిస్మత్, లాక్మే ఇండియా, లివోజెన్ వంటి బ్రాండ్‌లకు ప్రచారకర్తగా కొనసాగుతుంది. ఎండార్స్‌మెంట్స్ ద్వారానే సానియా మీర్జా ఏడాదికి రూ.25 కోట్లు సంపాదిస్తుందని DNA రిపోర్ట్ తెలిపింది.
హైదరాబాద్,దుబాయ్‌ల్లో విశాలవంతమైన ఇళ్లు సానియా పేరు మీద ఉన్నట్టు సమాచారం. వీటితో పాటు సానియాకు కార్లంటే పిచ్చి ఉండటంతో ఆమె దగ్గర కోట్లు విలువ చేసే పలు రకాల బ్రాండ్స్ కార్లు కూడా ఉన్నాయి.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications