పోస్టరే ఈ రేంజ్‌లో ఉంటే: విశ్వంభర విడుదల తేదీ ఇదే..!!

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం.. విశ్వంభర. ఆయన నటిస్తోన్న 156వ సినిమా ఇది. మైథలాజికల్- అడ్వెంచర్‌‌గా తెరకెక్కుతోంది. మల్లిడి వశిష్ట దర్శకుడు. ఇదివరకు నందమూరి కల్యాణ్‌రామ్‌ నటించిన బింబిసారకు దర్శకత్వం వహించాడు.

తన తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో భారీ సినిమాను తెరకెక్కిస్తోన్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ కింద నిర్మాతలు వీ వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఈ ఫాంటసీ మూవీపై ఇప్పటికే పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది.

Sankranthi 2024: Megastar Chiranjeevis latest movie Viswambhara title will be out on Jan 15

చిరంజీవి బర్త్‌డే సందర్భంగా విడుదల అయిన మెగా 156 కాన్సెప్ట్ పోస్టర్‌ అప్పట్లో సంచలనం రేపింది. అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం.. ఇలా పంచ భూతాలను ఒకే పోస్టర్‌లో చూపించేశారు నిర్మాతలు. సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతోందనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టయింది.

ఈ సినిమాకు విశ్వంభర అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ కూడా సినిమా కాన్సెప్ట్‌పై ఉత్కంఠతను రేకెత్తించింది. భోళాశంకర్ డిజాస్టర్ తరువాత మెగాస్టార్ నటిస్తోన్న సినిమా కావడం, అప్పుడెప్పుడో అంజి తరువాత అలాంటి జోనర్‌లో మళ్లీ చిరంజీవి నటిస్తోండటం వల్ల దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాపై దర్శకుడు మల్లిడి వశిష్ఠ అప్‌డేట్ ఇచ్చాడు. సంక్రాంతిని పురస్కరించుకుని సోమవారం టైటిల్ గ్లింప్సెస్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. వచ్చే ఏడాది అంటే 2025 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తామని తెలిపాడు.

ఈ సంక్రాంతికి టైటిల్ గ్లింప్లెస్ విడుదల కాబోతోన్న నేపథ్యంలో చిరంజీవి సంబంధించిన కొన్ని ఫ్యాన్ మేడ్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిరంజీవి ఓ హంటర్‌గా కనిపిస్తోన్నాడిందులో. నెత్తిన హ్యాట్, భుజానికి రోప్స్‌తో ఇండియానా జోన్స్ గెటప్‌లో రూపొందించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్.. ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+