సంక్రాంతి అందాల జాతర: బాక్సాఫీస్ వద్ద గ్లామర్ వార్!
తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. థియేటర్ల వద్ద పెద్ద సినిమాల కోలాహలం కూడా. ఈ సారి బాక్సాఫీస్ ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది. అయితే హీరోల మధ్య ఉన్న పోటీకి ఏమాత్రం తీసిపోని విధంగా హీరోయిన్ల మధ్య కూడా గ్లామర్ వార్ నడవబోతోంది. ఈ సంక్రాంతి పండుగ గ్లామరస్ భామల మధ్య జరుగుతున్న అసలైన అందాల జాతర అని చెప్పాలి. ప్రభాస్ నుంచి శర్వానంద్ వరకు స్టార్ హీరోలంతా రేసులో ఉండగా.. వారికి జోడీగా నటిస్తున్న హీరోయిన్ల లిస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంక్రాంతికి వెండితెరపై మెరవబోతున్న ఆ మహాలక్ష్మిల గురించి తెలుసుకుందాం.
'రాజా సాబ్'తో ముగ్గురు భామల ట్రీట్
జనవరి 9న రిలీజ్ కాబోతున్న ప్రభాస్ 'రాజా సాబ్' సినిమాతో పండుగ సందడి మొదలవుతోంది. ఈ చిత్రంలో ముగ్గురు అందాల భామలు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ సందడి చేయబోతున్నారు. గ్లామర్ పరంగానూ, కెరీర్ పరంగానూ ఈ ముగ్గురికీ ఇది అత్యంత కీలకమైన చిత్రం. హారర్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో వీరు ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

చిరు-వెంకీ మూవీలో నయన్, కేథరిన్ హంగామా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ఈ సంక్రాంతికే వస్తోంది. ఇందులో చిరుకు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. సాధారణంగా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయన్, ఈ సినిమా కోసం మొదటి నుంచే యాక్టివ్‌గా పాల్గొంటుండటం విశేషం. వీరితో పాటు కేథరిన్ థ్రెసా కూడా ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది.
రవితేజ మార్క్ గ్లామర్.. ఆషికా, డింపుల్
మాస్ మహారాజా రవితేజ 'మాస్' హైపర్‌కు గ్లామర్ టచ్ ఇచ్చేందుకు డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ రెడీ అయ్యారు. డింపుల్ ఈసారి కొంచెం ఫ్యామిలీ లుక్స్‌లో కనిపిస్తుండగా, ఆషికా రంగనాథ్ తన గ్లామర్ షోతో కుర్రకారును ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.
డబ్బింగ్ చిత్రాల నుంచి పూజా, శ్రీలీల పోటీ
డైరెక్ట్ తెలుగు సినిమాలే కాకుండా, డబ్బింగ్ చిత్రాల ద్వారా ఇతర భాషా భామలు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. జననాయగన్, పరాశక్తి చిత్రాలతో పూజా హెగ్డే, శ్రీలీల, మమితా బైజు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ముఖ్యంగా పూజా హెగ్డే, శ్రీలీల వంటి స్టార్ హీరోయిన్లు పండుగ బరిలో ఉండటంతో కాంపిటీషన్ మరింత పెరిగింది. వచ్చే సంక్రాంతికి ఇంతమంది 'మహాలక్ష్మి'లు థియేటర్లలో సందడి చేస్తుంటే, మరి బాక్సాఫీస్ వద్ద సిరిమాలక్ష్మి అనుగ్రహం ఏ భామకు దక్కుతుందో వేచి చూడాలి!












Click it and Unblock the Notifications