దుమ్ము దులిపేసిన వెంకీమామ... అల్లు అర్జున్ రికార్డు బద్దలు
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈనెల 14వ తేదీన థియేటర్లలోకి అడుగుపెట్టింది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులను కామెడీతో అలరించడానికి వచ్చిన ఈ సినిమా సంచలన రికార్డులను నమోదు చేస్తోంది. 10వ తేదీన విడుదలైన గేమ్ ఛేంజర్, 12వ తేదీన విడుదలైన డాకూ మహారాజ్ సినిమాలను దాటేసి ముందుకు దూసుకుపోతోంది. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కావడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న డాకూ మహారాజ్ కూడా వెంకీ ధాటికి వెనకబడిపోయింది. లేదంటే ఈ సమయానికి బాలయ్య సినిమా రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసివుండేది.
అల వైకుంఠపురం రికార్డు బద్ధలు
మొదటి వారం రోజుల్లోనే రూ.200 కోట్లు కొల్లగొట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురం పేరుతో ఉన్న రికార్డులను బద్దలు కొట్టేసింది. చాలా ప్రాంతాల్లో ఈ సినిమా కలెక్షన్లను దాటేసి ముందుకు దూసుకుపోతోంది. మరో వారం రోజుల్లో ఈ సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డులను దాటేసి పుష్ప2 రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో కామెడీ సినిమాగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడం సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు బాగా కలిసివచ్చింది.

ఆ లోటు తీర్చిన అనిల్ రావిపూడి
పిచ్చి పిచ్చి యాక్షన్ సినిమాలు తీసి ప్రేక్షకులను బాగా హింసిస్తున్న డైరెక్టర్లంతా ఈ సినిమాను చూసి నేర్చుకోవాలనుకుంటున్నారు. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయాలంటే వారికి కావాల్సింది కామెడీ మాత్రమే. థియేటర్ కు వందల రూపాయలు ఖర్చుపెట్టి వచ్చేది చెత్త సినిమాలు చూడటానికి కాదు. హాయిగా కుటుంబ సభ్యులతో కలిసి కొంచెంసేపు నవ్వుకోవడానికే. అదివ్వడంతో వెంకీమామ, అనిల్ రావిపూడి విజయవంతమయ్యారు. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ తర్వాత తెలుగులో కామెడీ చిత్రాలు చేసేవారు కరవయ్యారు. ప్రేక్షకులు కూడా ఏదో తప్పనిసరిగా సినిమాలు చూస్తున్నారుకానీ వారిని మనస్ఫూర్తిగా నవ్వించేలా సినిమాలు తీసే దర్శకులు రావడంలేదు. తెలుగు సినీ పరిశ్రమకు ఇప్పుడు అనిల్ రావిపూడి రూపంలో ఆ లోటు తీరిందని భావించవచ్చు.












Click it and Unblock the Notifications