'ఆ డైరెక్టర్ వలలో చిక్కిన మోనాలిసా.. హీరోయిన్ ను చేస్తానని చెప్పి..'
దురదృష్టం ప్రతిసారి తలుపు తడుతుంది.. కానీ అదృష్టం మాత్రం ఒక్కసారే తలుపు తడుతుంది.. అనే నానుడిని ఆమె నిజం చేసింది. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోడానికి మహాకుంభమేళాకు వచ్చింది మోనాలిసా. కానీ ఆ ప్రయాణం ఆమె జీవితాన్ని మలుపు తిప్పుతుందని భావించలేదు. ఒక్క రాత్రిలోనే వైరల్ గర్ల్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన తేనె కళ్లు, అందం, చిరునవ్వుతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. కుంభమేళాకు వెళ్లిన వారు ఆమెతో ఫొటోలు దిగడం, రీల్స్ చేయడంతో మోనాలిసా ఒక్కసారిగా నేషనల్ రేంజ్ లో పాపులర్ అయింది. మోనాలిసా మోస్ట్ ఫేవరేట్ ఇండియన్ సెలబ్రిటి అంటూ కామెంట్స్ పెట్టారు. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి.
డైరెక్టర్ వలలో మోనాలిసా..
ఈ క్రమంలో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. సోషల్ మీడియాలో మోనాలిసా చిత్రాలు చూసి హీరోయిన్ అవకాశం ఇస్తానన్నారు. ఆమెకు యాక్టింగ్ పై ట్రెయినింగ్ కూడా ఇప్పిస్తున్నారు. ఆమె నటనకు సంబంధించి అన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. అయితే డైరెక్టర్ సనోజ్ మిశ్రా .. మోనాలిసాతో క్లోజ్ గా ఉండటంపై బాలీవుడ్ నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. సనోజ్ మిశ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోనాలిసాను పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని, ఆమెను ట్రాప్ చేస్తున్నారని, తప్పుదారి పట్టిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

నా కూతురు లాంటిది..
అయితే తాజాగా నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై డైరెక్టర్ సనోజ్ మిశ్రా స్పందించారు. " మోనాలిసాకు నా కూతురు వయసు ఉంటుంది. నేను ఆమెను వేధించడం లేదు. ఆమె ఇష్టపూర్వకంగానే నటనపై శిక్షణ ఇప్పిస్తున్నాను. మోనాలిసా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆమెను నేనే యాక్టింగ్ నేర్పిస్తున్నాను. ఇది తప్పుదోవ పట్టించడం కాదు. ఆమెకు శిక్షణ పూర్తయ్యాక నా సినిమాలో అవకాశం ఇస్తా" అని చెప్పుకొచ్చారు.
ఈ మేరకు నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ పై విరుచుకుపడ్డారు. జితేంద్ర అబద్ధాలు చెప్పడం తప్ప ఏమీ సాధించలేదని.. తన అబద్ధాలతో మొత్తం దేశాన్నే ట్రాప్ లోకి లాగుతున్నాడని మండిపడ్డారు. ఇక డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. ప్రస్తుతం ది డెయిరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications