తెలుగులో అతనంటే చాలా ఇష్టం - ధురంధర్ బ్యూటీ
బాలీవుడ్‌లో సంచలన విజయంతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది యంగ్ బ్యూటీ "సారా అర్జున్". బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా.. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన "ధురంధర్" సినిమాలో నటించి మెప్పించింది. ఈ మూవీలో మాధవన్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సక్సెస్ జోష్ లోనే ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో హాట్ టాపిక్‌గా మారింది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన సారా విక్రమ్ హీరోగా వచ్చిన "నాన్న" మూవీలో నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. రీసెంట్ గా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన "పొన్నియన్ సెల్వన్" చిత్రంలో సైతం మెప్పించింది. క్రమంగా తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటూ హీరోయిన్‌గా ఎదిగింది. కాగా ధురంధర్ సినిమా ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ భారీ విజయం తర్వాత సారా అర్జున్ టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది.

ప్రస్తుతం ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'యుఫోరియా', అలాగే గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న 'మ్యాజిక్' సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. ముఖ్యంగా 'యుఫోరియా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 'యుఫోరియా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సారా అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ హీరో అంటే ఇష్టం..
టాలీవుడ్ హీరోల్లో తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం, ఆయనే తన ఫేవరెట్ హీరో అని సారా చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మాటలు విన్న వెంటనే రౌడీ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. సారా మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ నటన, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తే ఒక ప్రత్యేకమైన వైబ్ ఉంటుంది" అంటూ వెల్లడించింది. ఈ కామెంట్స్‌తో విజయ్ ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతున్నారు. భవిష్యత్తులో ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని అభిమానులు ఇప్పటికే కోరుకుంటున్నారు.
ఇక 'యుఫోరియా' విషయానికి వస్తే, ఇది కేవలం యూత్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో రూపొందిన పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. సమాజంలో యువత డ్రగ్స్ వలలో ఎలా చిక్కుకుంటోంది, ఒక తల్లి తన కొడుకును ఆ ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం. ట్రైలర్ చూస్తేనే కథ ఎంత ఎమోషనల్‌గా, ఇంటెన్స్‌గా ఉంటుందో అర్థమవుతోంది. ఈ సినిమాలో భూమికా చావ్లా తల్లి పాత్రలో కీలకంగా కనిపిస్తుండగా, సారా అర్జున్ ఓ ఇంపార్టెంట్ రోల్‌లో నటిస్తోంది. ఫిబ్రవరి 6న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్ అయితే, సారా టాలీవుడ్‌లో స్థిరపడడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
-
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!












Click it and Unblock the Notifications