కార్తి 'సర్దార్ 2' ట్రైలర్ వచ్చేసింది.. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్
కార్తి హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ 2 ట్రైలర్ వచ్చేసింది. 2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ 'సర్దార్' చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న 'సర్దార్ 2' పై పాన్ ఇండియా రేంజ్ లో ఏ మేరకు అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కావడంతో కార్తి ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ లు, విజువల్స్, సామ్ సీ. ఎస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు.
సర్దార్ 2 చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగులో విడుదల చేయనుంది. ఇక ఎస్ జే సూర్య నెగెటివ్ రోల్ లో ఈ మూవీలో నటించారు. అలాగే మాళవిక మోహనన్, రజిషా విజయ్, ఆషికా రంగనాథ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇక ఈ మూవీ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక 'సర్దార్' సినిమాలో కార్తీ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ ఎక్కువ భాగం ఫ్లాష్ బ్యాక్ లో చంద్రబోస్ అనే వ్యక్తి ఏజెంట్ సర్దార్ గా ఎలా మారాడు..? ఆయన సీక్రెట్ మిషన్ ఏంటి..? అనే అంశాల చుట్టూ సాగింది. అలాగే తన కుమారుడు విజయ్ ప్రకాశ్ తో కలిసి ఏదో మిషన్ కోసం రంగంలోకి దిగినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది.
#Karthi arrives bringing Solid Spy Actioner. double ❤️🔥❤️🔥#Sardar2 On Sept 10th,2026. pic.twitter.com/tRNiftlMZF
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) August 31, 2026
ఇక కోట్లాది మంది ప్రాణాలను కాపాడేందుకు చంద్ర బోస్ చేపట్టే అత్యంత ప్రమాదకరమైన మిషన్, రైళ్లు, విమానాలు, శత్రువుల స్థావరాల్లో జరిగే భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ట్రైలర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చివర్లో సూర్య- కార్తి మధ్య వార్ లెవెల్ సీక్వెన్స్ లు అద్భుతంగా తెరపై కనిపిస్తున్నాయి. సర్దార్ వన్స్ ఏ స్పై ఆల్ వేస్ ఏ స్పై అనే టైటిల్ కు పూర్తి జస్టిఫికేషన్ ఇచ్చినట్లు ట్రైలర్ కట్ చేసిన విధానం చూస్తే తెలిసిపోతుంది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 10న ఎలాంటి బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications