ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్

వెండితెరపై గ్లామర్ చూపించడం వేరు, అసభ్యతకు అద్దం పట్టడం వేరు. కన్నడ యాక్షన్ స్టార్ ధ్రువ సర్జా నటించిన పాన్ ఇండియా మూవీ 'కేడీ: ది డెవిల్' ఇప్పుడు సరిగ్గా ఇదే గీతను దాటి భారీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని 'సర్కే చునార్ తేరీ సర్కే' అనే ఐటెం సాంగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అగ్గి రాజేసింది. కేవలం సోషల్ మీడియా ట్రోలింగ్‌తో ఆగకుండా, ఈ వ్యవహారం ఏకంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వరకు వెళ్లడం, ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించడం చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది.

ఈ పాటలో వాడిన సాహిత్యం, నోరా ఫతేహి చేసిన నృత్య భంగిమలు అత్యంత అసభ్యకరంగా ఉన్నాయంటూ ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన కేంద్రం, తక్షణమే అన్ని డిజిటల్ వేదికల నుంచి (YouTube, Instagram) ఈ పాటను తొలగించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ను ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి అసభ్యకర కంటెంట్ పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ ఉండాలని హెచ్చరించింది. దీంతో ప్రస్తుతం యూట్యూబ్ నుంచి ఈ పాట మాయమైనప్పటికీ, ఇప్పటికే వైరల్ అయిన క్లిప్పులు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

Sarke Chunar Controversy Govt Intervenes As KD The Devil Song Sparks Vulgarity Debate Across India

ఊహించని ట్విస్ట్..

ఈ వివాదంలో ఊహించని ట్విస్ట్ ఏంటంటే.. ఈ పాట రాసినట్లుగా భావిస్తున్న రచయిత రకీబ్ ఆలం బాంబు పేల్చారు. "ఈ సాహిత్యం నేను రాయలేదు. దర్శకుడు ప్రేమ్ కన్నడలో రాసిన దాన్ని అనువదించి ఇవ్వమని అడిగితే కేవలం రఫ్ వెర్షన్ ఇచ్చాను. కానీ వాళ్ళు దాన్ని చాలా అసభ్యంగా మార్చేశారు. నేను ముందే హెచ్చరించినా వినలేదు" అంటూ ఆయన చేతులెత్తేశారు. మరోవైపు ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ వంటి వారు సైతం ఈ పాట వినకుండా ఉంటే బాగుండేదని అసహనం వ్యక్తం చేయడంతో చిత్ర బృందం డిఫెన్స్‌లో పడింది.

రంగంలోకి నటి రక్షిత ..

వివాదం ముదురుతున్న వేళ, దర్శకుడు ప్రేమ్ భార్య, నటి రక్షిత రంగంలోకి దిగారు. నెటిజన్ల దాడిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో 'చోళీ కే పీచే', 'డ్రీమమ్ వేకపమ్' వంటి పాటలు వచ్చినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు? అని ఆమె ప్రశ్నించారు. "పాట నచ్చకపోతే ప్రశ్నించండి, కానీ వ్యక్తిగతంగా దూషించే హక్కు ఎవరికీ లేదు. ఒక పాట తప్పుగా ఉన్నంత మాత్రాన ఆయనను మంచి దర్శకుడు కాదు అని అనలేం" అంటూ తన భర్తను సమర్థించుకున్నారు. 'కేడీ' తమకు బిడ్డ లాంటిదని, త్వరలోనే కొత్త సాహిత్యంతో పాటను విడుదల చేస్తామని ఆమె భరోసా ఇచ్చారు. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ సినిమాకు ఈ వివాదం ఎంతవరకు ప్లస్ అవుతుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+