Vijay Devarakonda: ఆ రోజున వస్తున్న "ఫ్యామిలీ స్టార్"..రచ్చ రచ్చే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ.. ఆ పేరు వింటే యూత్‌కు పూనకాలొస్తాయి. సినిమా హిట్టా ఫ్లాపా అన్నదాంతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఈ రౌడీ బాయ్‌ని ఇష్టపడతారు. అర్జున్‌ రెడ్డితో క్రేజ్ అమాంతంగా పెంచేసుకున్న విజయ్ దేవరకొండ.. తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక మార్క్‌ను సంపాదించుకున్నాడు. యూత్‌లో ముఖ్యంగా అమ్మాయిల్లో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. ఖుషీ సినిమా మిక్స్‌డ్ రిజల్ట్ ఇవ్వడంతో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన ఫ్యామిలీ స్టార్‌ పైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తోంది.

విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్ - దివ్యాన్ష కౌశిక్ నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ నెట్టింట హల్చల్ చేస్తోంది. పెద్ద సన్సేషనే క్రియేట్ చేసింది. పరుశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం వాస్తవానికి సంక్రాంతి బరిలో నిలవాల్సి ఉంది. అయితే గుంటూరుకారం, సైంధవ్, నా సామిరంగ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కానుండటంతో చిత్ర యూనిట్ కలెక్షన్ల పరంగా కూడా ఆలోచించి ఫ్యామిలీ స్టార్‌ చిత్రం విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం.

Save the Date: Family Star,Featuring Vijay Devarakonda,Hits Theatres on April 5th

సాధారణంగా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీస్‌ విడుదలకు సరైన సమయం సంక్రాంతి. అయితే ఇండస్ట్రీ టాప్ స్టార్స్ చిత్రాలు వరుసగా క్యూలో ఉన్నందున మూవీ మేకర్స్ రిలీజ్‌పై పునరాలోచన చేశారు. ఇక మార్చిలో రిలీజ్ చేద్దామనుకుంటే పరీక్షల సమయం కాబట్టి అప్పుడు కూడా కలెక్షన్ల పై ప్రభావం చూపే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ పై అప్‌డేట్ వచ్చేసింది. ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సమయంలో అయితే హాట్ సమ్మర్‌లో ఓ కూల్ మూవీ చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక విజయ్-పరశురాం కాంబోలో వచ్చిన గీతా గోవిందం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తిరిగి ఇదే కాంబోలో మరో ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో అది కూడా రౌడీ బాయ్ నటిస్తుండటంతో ఇండస్ట్రీలో అంచనాలు పీక్‌‌కు వెళ్లాయి.విజయ్-పరశురాం కాంబినేషన్ మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఫిలింనగర్‌ టాక్.ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత కావడం మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కొన్ని నెలల క్రితం రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ టీజర్‌ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక మృణాల్ ఠాకూర్ కూడా హ్యాట్రిక్ హిట్ కోసం వెయిట్ చేస్తోంది.

మార్చి 29న సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ రిలీజ్ కానుండగా సరిగ్గా వారం రోజులకు విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్-పరుశురాం కాంబినేషనల్ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కానుంది. రెండు యంగ్ హీరోస్‌వే కావడంతో ఈ చిత్రాలపై భారీ అంచనాలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఫ్యామిలీ స్టార్ విడుదల సమయంలో దేశం ఎలక్షన్స్ మూడ్‌లో ఉంటుంది. అయితే అన్నిటినీ బీట్ చేసి సరికొత్త రికార్డు సృష్టిస్తుందని చిత్ర బృదం కాన్ఫిడెన్స్‌తో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+