విదేశీ వ్యవహారాల శాఖ చూసిన సినిమా.. బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన చిత్రం
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యూనిక్ స్పై డ్రామా 'సీక్రెట్ సోల్జర్'. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సెప్టెంబర్ 18న సినిమా విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. " ట్రైలర్ చాలా బాగుంది. ఇందులో చిత్ర బృందం చేసిన కష్టం స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా మంచి రైటింగ్, క్వాలిటీ ఉన్న సినిమాలను తెలుగు ఆడియన్స్ తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ఇది అందరూ బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన చిత్రం" అంటూ ఆయన పేర్కొన్నారు. రైటర్, డైరెక్టర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ.. "సీక్రెట్ సోల్జర్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ సినిమా సెన్సార్‌లోనే 8 నెలల పాటు ఉందని విన్నాను. కచ్చితంగా అందరికీ నచ్చడం వల్లే సెన్సార్ నుంచి బయటకు వచ్చింది. నిర్మాత ఈ సినిమాకి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చుపెట్టి తీశారు. సినిమాపై చాలా ప్యాషన్ ఉంది ఆయనకి. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధించి, ఆయన మరో సినిమా తీయాలని కోరుకుంటున్నాను. కాలభైరవ మ్యూజిక్ చాలా బాగుంది. చాలా మంచి స్ట్రాంగ్ టీమ్‌తో వస్తున్నారు. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను." అని ఆయన పేర్కొన్నారు.

నటి శాన్వి మాట్లాడుతూ.. నిహాల్ మంచి పెర్ఫార్మర్ అని, కథలో బలమైన ఎమోషన్, ఫ్రెండ్షిప్ ఉన్నాయని పేర్కొన్నారు. హీరో నిహాల్ మాట్లాడుతూ.. "ఈ సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు వెళ్లిన సినిమాల్లో 'దురంధర్', సల్మాన్ ఖాన్ సినిమా, మూడోది ఈ సినిమా. అంత పెద్ద సినిమా ఇది. మా సినిమాలో ఉన్న ఐడియా, ఎఫర్ట్, విజువల్‌ను చూడండి. " అంటూ ఆయన పేర్కొన్నారు.
దర్శకుడు అక్కి విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రయాణం చాలా ఛాలెంజింగ్‌గా సాగిందని, నిహాల్, సూర్య, హర్షితలతో పాటు టెక్నికల్ టీమ్ అత్యుత్తమ నాణ్యతతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని గర్వంగా చెప్పారు. అలాగే నటీమణులు దీక్షా పంత్, హర్షిత, శ్రీష తమ పాత్రల ప్రాధాన్యతను వివరిస్తూ, సెప్టెంబర్ 18న విడుదలవుతున్న ఈ స్పై థ్రిల్లర్‌ను ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు.














Click it and Unblock the Notifications