కోరిక తీర్చమని డోర్ కొట్టేవారు..ఎయిడ్స్ రావడంతో..నటి షాకింగ్ కామెంట్స్
ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.
తాజాగా సీనియర్ నటి అన్నపూర్ణమ్మ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అన్నపూర్ణకు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.ఆనాటి హీరోలకు తల్లిగా, అక్కగా నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారామె. ఇప్పటితరం సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ మారారు. తాజాగా ఆమె తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓ యూట్యూబ్ ఛానెల్‌ల్లో మాట్లాడారు.

తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, గతంలో ఇంకా ఎక్కువ ఉండేదని ఆమె కుండబద్దలు కొట్టేశారు. క్యాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీ ఒక్కదానికే పరిమితం కాలేదని.. మహిళలు పని చేసే ప్రతిచోట ఈ వేధింపులు తప్పవని ఆమె చెప్పుకొచ్చారు. తప్పు అనేది ఒకరివైపే ఉండదని.. ఎదుట వారి బట్టే ఇద్దరి మధ్య ఉంటుందని అన్నపూర్ణమ్మ తెలిపారు. క్యాస్టింగ్ కౌచ్ అన్ని రంగాల్లో ఉంటుంది. కుటుంబ పరువు, మర్యాద కోసం మహిళలు తెలివిగా తప్పించుకుంటున్నారు.
అవకాశాల కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ఈ లైంగిక వేధింపులు తప్పవని అన్నారు. సినిమా షూటింగ్స్ కోసమని ఎక్కడెక్కడికో తిరిగేవాళ్ళం. అర్థరాత్రి కూడా కక్కుర్తి గాళ్ళు మా రూమ్ తలుపులు కొట్టేవారు. ఎయిడ్స్ వచ్చాక ఈ లైంగిక వేధింపులు తగ్గాయి. ఎవరికి ఎయిడ్స్ ఉందో అని భయపడి లైంగికంగా వేధించడం మానేశారు. ఎయిడ్స్ వచ్చి మంచి పని అయ్యింది. ఒక్కోసారి చెడు వలన కూడా మంచి జరుగుతుందంటే అది ఇదేనేమో అని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications